Advertisementt

Bigg Boss 7: ట్రెండింగ్ లో రైతు బిడ్డ

Sat 07th Oct 2023 11:46 AM
pallavi prashanth  Bigg Boss 7: ట్రెండింగ్ లో రైతు బిడ్డ
Pallavi Prashanth trends on twitter Bigg Boss 7: ట్రెండింగ్ లో రైతు బిడ్డ
Advertisement
Ads by CJ

రైతు బిడ్డగా బిగ్ బాస్ సీజన్ 7 లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ సీరియల్ ఆర్టిస్ట్ లు, మోడల్స్, సినిమా నటుల మధ్యన నిలదొక్కుకుని ఐదో వారంలో హౌస్ కి మొదటి కెప్టెన్ గా అవతరించడంతో పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నాడు. హౌస్ లో రతిక, అమరదీప్ లు పల్లవి ప్రశాంత్ ని అనుకోకుండా బాగా హైలెట్ చేసారు. 

అతనిలో ప్రత్యేకత ఏమి లేకపోయినా.. ఎదుటివాళ్ళు అతన్ని ఎక్కువగా పట్టించుకుని హైప్ ఇస్తున్నారు. ఇక శివాజీ తన భార్య లెటర్ త్యాగం చేసి పల్లవి ప్రశాంత్ కి కెప్టెన్సీ కంటెండర్ షిప్ ఇవ్వడంతో రంగు పడుద్ది టాస్క్ లో అందరూ సందీప్ మాస్టర్ ని అవుట్ చెయ్యాలనే తాపత్రయంలో పల్లవి ప్రశాంత్ ని వదిలేసారు. ఫైనల్ గా గౌతమ్-పల్లవి ప్రశాంత్ మధ్యలో టాస్క్ పడగా.. పల్లవి ప్రశాంత్ గెలిచి మొదటి కెప్టెన్ గా నిలిచాడు. 

అలాగే అమరదీప్ ఇంకా ఇంకా పల్లవి ప్రశాంత్ పై వెనుకగా వెటకారంగా మాట్లాడడం అతనికి ప్లస్ అయ్యింది. అలాగే అతనికి నెటిజెన్స్ నుంచి సపోర్ట్ పెరుగుతూ వస్తుంది. దానితో రైతు బిడ్డ ఇలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. 

Pallavi Prashanth trends on twitter:

Bigg Boss 7: Pallavi Prashanth trends on twitter

Tags:   PALLAVI PRASHANTH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ