Advertisementt

నితిన్ తమ్ముడు సెట్స్ లో లయ

Fri 06th Oct 2023 03:15 PM
laya  నితిన్ తమ్ముడు సెట్స్ లో లయ
Laya re-entry with Nithin movie నితిన్ తమ్ముడు సెట్స్ లో లయ
Advertisement
Ads by CJ

ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్ రేంజ్ ని అందుకోలేకపోయిన లయ.. ఆ తర్వాత పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుని అమెరికా వెళ్ళిపోయిన లయ అక్కడ భర్త, పిల్లలు, ఉద్యోగం అంటూ బిజీ లైఫ్ ని లీడ్ చెయ్యడమే కాదు.. కరోనా తర్వాత లయ అమెరికాలో స్నేహితులతో కలిసి ఇన్స్టా రీల్స్ తో సోషల్ మీడియాలో మరోసారి హైలెట్ అయ్యింది. 

క్యూట్ అండ్ స్వీట్ హీరయిన్ గా, ట్రెడిషనల్ గా కనిపించే లయ.. ఇప్పడు రీ ఎంట్రీకి రెడీ అయ్యింది. అందుకే లయ కొద్దిరోజుల అమెరికా నుంచి వచ్చి పలు యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వూస్ ఇచ్చింది. యూట్యూబ్ ఇంటర్వూస్ తో హడావిడి చేసింది రీ ఎంట్రీ కోసమే అన్నారు. అనుకున్నట్టుగానే లయ నితిన్ తమ్ముడు మూవీతో రీ ఎంట్రీ  ఇవ్వబోతుంది. రెండు రోజుల క్రితమే లయ నితిన్ మూవీ సెట్స్ లోకి ఎంటర్ అయ్యింది. 

అయితే లయ అక్కగానో, లేదంటే వదినగానో మత్రమే కేరెక్టర్స్ చెయ్యాలనుకుంటుంది. మరి ఆమెకి అక్క, వదిన కేరెక్టర్స్ వస్తాయో లేదంటే.. అమ్మ, అత్తా కేరెక్టర్స్ వస్తాయో తెలియాల్సి ఉంది. నితిన్ తమ్ముడు మూవీలో లయ కీలక పాత్రలో కనిపించబోతుంది అని వినికిడి. 

Laya re-entry with Nithin movie:

Laya re entry in Nithin Thammudu movie

Tags:   LAYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ