Advertisementt

ఎన్టీఆర్ ఫాన్స్ vs బాలయ్య ఫాన్స్

Sat 07th Oct 2023 09:23 PM
balakrishna,jr ntr,cbn arrest,i do not care,fans  ఎన్టీఆర్ ఫాన్స్ vs బాలయ్య ఫాన్స్
Balayya Fans vs Jr NTR Fans ఎన్టీఆర్ ఫాన్స్ vs బాలయ్య ఫాన్స్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం లేదు అంటూ నందమూరి అభిమానులు, టీడీపీ కేడర్ చాలా కినుకు వహిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఎన్టీఆర్ అభిమానులు vs బాలకృష్ణ అభిమానులు అన్నట్లుగా గొడవ షురూ అవుతోంది. అది కూడా ఓ రేంజ్‌లో. తాజాగా బాలకృష్ణ.. చంద్రబాబు అరెస్ట్‌పై ఎన్టీఆర్ స్పందించడం లేదు అంటే.. దానికి బాలయ్య ఐ డోంట్ కేర్ అంటూ సమాధానమివ్వడం ఎన్టీఆర్ ఫాన్స్‌కి నచ్ఛలేదు. దానితో బాలయ్యని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. 

బ్రో ఐ డోంట్ కేర్ బుల్ బుల్ అసలు నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నావో ఏం మాట్లాడాలనుకుంటున్నావో కనీసం నీకేనా అర్థం అవుతుందా.. నాయనా బాలయ్య నువ్వు ఇలాంటి ప్రెస్ మీట్‌లు పెట్టి పార్టీని సంక నాకించేలా ఉన్నావ్ ....! #iamwithNTR అంటూ బాలయ్యపై ఎన్టీఆర్ ఫాన్స్ ట్రోల్స్ మొదలు పెట్టారు. 

అంతేకాకుండా.. తెలుగుదేశం పార్టీకి నా సభ్యత్వాన్ని నా రాజీనామాను సమర్పిస్తున్నాను నా @tarak9999 అన్నను ఇంతలా ద్వేషించే పార్టీలో ఉండడం కరెక్ట్ కాదు..! నన్ను, నా కులాన్ని కించపరిచేలా మాట్లాడినా దానికి సమాధానం వెరీ సూన్ ప్రెస్ మీట్ పెడుతా ఆరోజు మాట్లాడుతా🙏🙏, 

అవును @tarak9999 అన్న కోసం ప్రాణాలు ఇస్తాం  పార్టీ అంటే అభిమానిస్తాం.. నాయకుడికి గౌరవం ఇస్తాం. మీలా అడ్డగోలుగా ఏది పడితే అది అవకాశం కోసం మాట్లాడం..! ఒక్కసారి ఓపెన్ డెబిట్ పెట్టుకుందామా ఎవరైనా దమ్మున్నోళ్ళు ప్రెస్ ముందరకి రావచ్చు ఎవరికి ఏం చేశారో కూడా బయటపడుతుంది అంటూ ఓ రెడ్డి ఎన్టీఆర్ అభిమాని ట్వీట్ చేశాడు. 

మరి మీ వాడ్ని ఎవడూ రాజకీయాల్లోకి లాగకూడదు అంటే ... అతగాడ్ని ప్రెస్మీట్ పెట్టి అయ్య నన్ను రాజకీయాల్లోకి లాగకండి, నేను నా సినిమా జీవితంలో ఉన్నాను నాకు ఆ పార్టీకీ, ఆ కుటుంబానికి సంబంధం లేదు అని చెప్పేయమను.. అంటూ నందమూరి అభిమాని ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకే కుటుంబానికి చెందిన అభిమానులు ఈ విధంగా రచ్చ చేసుకుంటూ తిట్టుకుంటున్నారు.

Balayya Fans vs Jr NTR Fans:

War Between Balayya and Jr NTR Fans in Social Medi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ