లోకేష్ కనగరాజ్ ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో టాప్ డైరెక్టర్‌గా మారడమే కాదు.. లోకేష్ నుంచి సినిమా వస్తుంది అంటే ప్యాన్ ఇండియా ప్రేక్షకులు సైతం ఎదురు చూసేలా క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు. విజయ్‌తో తెరకెక్కించిన మాస్టర్ సో, సో అయినప్పటికీ కార్తీ ఖైదీ, కమల్ విక్రమ్ సినిమాలతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌ని సృష్టించాడు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో కలిసి వరసగా హిట్స్ కొడుతున్నాడు.
లోకేష్ కనగరాజ్.. ఇప్పుడు విజయ్‌తో తెరకెక్కించిన లియో మూవీ ఈ నెల 19 న ప్యాన్ ఇండియా ఫిలింగా రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన ప్రమోషన్స్ మొదలు పెట్టినా.. లియో ఆడియో లాంచ్ వేడుక కోసం అభిమానులు ఎదురు చూసినా అది జరగలేదు. ఆడియో వేడుకకి కొన్ని గంటల ముందుగా అభిమానులని డిజప్పాయింట్ చేస్తూ మేకర్స్ దానిని క్యాన్సిల్ చేశారు. ఇక నిన్న గురువారం సాయంత్రం విడుదలైన లియో ట్రైలర్ ఓ వర్గం ఆడియన్స్‌ని బాగానే ఆకట్టుకుంది.
కానీ కొంతమంది లియో ట్రైలర్ చూసి పెదవి విరుస్తున్నారు. వయోలెన్స్ ఎక్కువైంది, అనిరుధ్ మ్యూజిక్ పై పెట్టుకున్న అంచనాలు రీచ్ అవ్వలేదు, BGM చాలా చప్పగా ఉంది, విజయ్ లుక్స్ బాలేదు, సంజయ్ దత్, అర్జున్, త్రిష లుక్స్ విషయంలో బావున్నారు. కానీ యాక్షన్ మరీ ఎక్కువైంది.. లోకేష్ నుంచి ఇది ఊహించనైననూ లేదు అంటూ సోషల్ మీడియాలో #Disappointed హాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తూ లియో ట్రైలర్ పై కామెంట్స్ చేస్తున్నారు.