Advertisementt

డిజె టిల్లు నోట.. గుంటూరు కారం మాట

Sat 07th Oct 2023 10:19 AM
siddu jonnalagadda,guntur kaaram,mahesh babu,song,mad  డిజె టిల్లు నోట.. గుంటూరు కారం మాట
Guntur Kaaram Update From Siddu Jonnalagadda డిజె టిల్లు నోట.. గుంటూరు కారం మాట
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాపై ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా వార్తలు రావాలో అన్ని రకాలుగా వార్తలు వచ్చాయి. సినిమా ఆగిపోయిందని, మహేష్‌కి కథ నచ్చలేదని, వాయిదా పడిందని, హీరోయిన్ మారిందని, టెక్నీషియన్స్ మారారని.. ఇలా రకరకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఆఫ్‌కోర్స్.. ఈ వార్తలలో కొన్ని నిజాలు కూడా ఉన్నాయనుకోండి. మరీ ముఖ్యంగా ఈ సినిమా విషయంలో ఇప్పటికీ హాట్ టాపిక్‌గా నడుస్తున్న వార్త ఏమిటంటే.. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందా?

అయితే ఈ అనుమానాలకు తెరదించుతూ.. సంక్రాంతికి పక్కా అంటూ నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. అందులో డౌటే పెట్టుకోవద్దు అంటూ పక్కాగా సంక్రాంతికి వస్తున్నాం అని కన్ఫర్మ్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు గుంటూరు కారం మాట డిజె టిల్లు సిద్ధు జొన్నలగడ్డ నోట విని ఫ్యాన్స్ పిచ్చ ఆనంద పడుతున్నారు. ఎందుకంటే, టిజె టిల్లు ఈ సినిమాకు సంబంధించి ఇచ్చిన అప్‌డేట్ అలాంటిది మరి.

తాజాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కిన మాడ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేడుకకు సిద్ధు జొన్నలగడ్డ కూడా ఒక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిద్ధు మాట్లాడుతూ.. చినబాబుగారు ఈరోజు మధ్యాహ్నం ఒక విషయం చెప్పారు. అది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు. ఇవాళ గుంటూరు కారం సాంగ్ షూట్ నుంచి వచ్చారంట. చినబాబుగారి గొంతులో నేను అంత ఎక్సైట్‌మెంట్ చాలా రోజుల తర్వాత విన్నాను. సాంగ్ సూపర్‌గా వచ్చింది, థియేటర్లు తగలబడిపోతాయని ఆయన అన్నారంటూ చెప్పకొచ్చాడు. అంతే.. ఈ మాటతో ఫ్యాన్స్ హాయిగా రెండు చేతులు ఫ్యాంట్ జేబులో పెట్టుకుని హుషారుగా చక్కర్లు కొడుతున్నారు.

Guntur Kaaram Update From Siddu Jonnalagadda:

Siddu Jonnalagadda about Guntur Kaaram Movie Song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ