Advertisementt

సాయిపల్లవే సీత!

Fri 06th Oct 2023 10:41 AM
sai pallavi,sita,ranbir kapoor,allu aravind,yash  సాయిపల్లవే సీత!
Sai Pallavi Plays Sita Role in Ranbir Kapoor Ramayan సాయిపల్లవే సీత!
Advertisement
Ads by CJ

రామాయణ కథ ఎన్నిసార్లు విన్నా, చూసినా.. చూసిన వారికి, విన్నవారికి పుణ్యం వస్తుందని అంటుంటారు. అందుకే మన మేకర్స్ పదే పదే ఆ కథను వైవిధ్యంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్‌గా ప్రభాస్, కృతి సనన్‌లతో ఆదిపురుష్ పేరుతో ఓం రౌత్ రామాయణ గాధని కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆఫ్‌కోర్స్ అది అంతగా వర్కవుట్ కాలేదనుకోండి. ప్రభాస్ వంటి నటుడితో ఓం రౌత్ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. ఇప్పుడు బాలీవుడ్‌కు చెందిన మరో దర్శకుడు రామాయణ కథని సినిమా రూపంలో తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడొక వార్త బాగా వైరల్ అవుతోంది. 

అదేంటంటే.. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ రామాయణ కథని సినిమాగా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో సీత పాత్ర కోసం ఆలియా భట్ ఫిక్సయినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీతగా నటించిన ఆలియా మరోసారి ఈ సినిమాలో సీతగా నటించబోతుందనేలా వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో.. ఇప్పుడా పాత్రకు మరో హీరోయిన్‌ని తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు డ్యాన్సింగ్ బ్యూటీ సాయిపల్లవి. సీత పాత్ర కోసం రీసెంట్‌గా మేకర్స్ ఆమెను సంప్రదించగా.. ఆమె ఓకే చెప్పిందని అంటున్నారు. త్వరలోనే ఈ పాత్రకు ఆమె లుక్ టెస్ట్ కూడా చేయబోతున్నారట.

రాముడు, సీత సంగతి అలా ఉంటే.. ఈ సినిమాలో నటించే రావణుడి పాత్ర, ఆ పాత్ర విషయంలో వినిపిస్తున్న పేరే ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అవుతుంది. కెజియఫ్‌తో సంచలనానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన రాక్‌స్టార్ యశ్.. ఈ సినిమాలో రావణ పాత్రను చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. రెండు భాగాలుగా రూపుదిద్దుకొనే ఈ చిత్ర షూటింగ్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న మొదలై ఏకధాటిగా ఆగస్టు వరకూ జరుగుతుందని సమాచారం. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్‌ కోసం ఆస్కార్‌ అవార్డ్‌ అందుకున్న డిఎన్‌ఈజీ సంస్థతో చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్‌, మధు మంతెన సంప్రదింపులు జరుపుతున్నారట.

Sai Pallavi Plays Sita Role in Ranbir Kapoor Ramayan:

Ranbir - Sai Pallavi in Ramayan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ