Advertisementt

బుట్టబొమ్మ కాలికి దెబ్బలు

Wed 04th Oct 2023 07:27 PM
pooja hegde  బుట్టబొమ్మ కాలికి దెబ్బలు
Pooja Hedge shared a story about her knee injuries బుట్టబొమ్మ కాలికి దెబ్బలు
Advertisement
Ads by CJ

పూజ హెగ్డే గుంటూరు కారం నుంచి తప్పకున్నాక ఆమె పేరు తెలుగులో వినిపించడమే లేదు. గుంటూరు కారం నుంచి పూజ హెగ్డే ని కావాలనే తప్పించారని ప్రచారం జరిగింది. ఆమెకి వరస వైఫల్యాలు చుట్టుముట్టడంతో ఆమెని కావాలనే మహేష్ మూవీ నుంచి తపించారన్నారు. కానీ నిర్మాత నాగవంశీ మాత్రం పూజ హెగ్డే కి డేట్స్ ప్రాబ్లెమ్ వలనే ఆమె గుంటూరు కారం నుంచి తప్పుకుంది అని చెప్పారు. 

ప్రస్తుతమ్ టాలీవుడ్ లో పూజ హెగ్డే కి ఎలాంటి ఆఫర్స్ రావడం లేదు. మధ్యలో ఆమె కాలికి మోకాలి ఆపరేషన్ జరగడం వలనే ఆమె మహేష్, పవన్ సినిమా నుంచి తప్పుకుంది అన్నారు. తాజాగా పూజ హెగ్డే మోకాలికి దెబ్బలు తగిలించుకున్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. పూజ హెగ్డే ఓ ప్రాజెక్టు కోసం బాక్సింగ్ నేర్చుకునే క్రమంలో ఆమె కాలికి దెబ్బలు తగిలాయి. 

అదే విషయాన్ని పూజ హెగ్డే సోషల్ మీడియాలో షేర్ చేసింది. పూజ హెగ్డెనే కాదు.. చాలామంది హీరోయిన్స్ సినిమాల కోసం మార్షల్ ఆర్ట్స్, యుద్ద శిక్షణ వంటివి చేస్తూ ఉంటారు. మరి పూజ కూడా ఆ క్రమంలోనే ఇలా బాక్సింగ్ నేర్చుకుంటూ గాయాలపాలయ్యింది. ప్రస్తుతం సౌత్ కి దూరంగా హిందీ ప్రాజెక్ట్ ల్లో పూజ హెగ్డే బిజీగా మారింది. 

Pooja Hedge shared a story about her knee injuries:

Pooja Hegde Knee Injury Pic Viral

Tags:   POOJA HEGDE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ