మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు అరెస్ట్ పై ఏపీలోని టీడీపీ నేతలే కాదు, చాలామంది ప్రజలు కూడా ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే.. ఫ్యామిలీ మెంబెర్స్ నారా భువనేశ్వరి, బ్రాహ్మణీలు చంద్రబాబుని విడుదల చెయ్యాలంటూ పోరాడుతున్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్ ని చాలామంది రాజకీయపార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ, అలాగే జనసేన, తెలంగాణాలో బీఆరెస్ లు కూడా చంద్రబాబు అరెస్ట్ పై గళం వినిస్తున్నాయి. హైదరాబాద్ ని ఎంతో డెవెలెప్ చేసిన చంద్రబాబు అరెస్ట్ పై టీఆరెస్ నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి తలసాని చంద్రబాబు అరెస్ట్ పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
మాజీ ముఖ్యమంత్రి, TDP అధినేత @ncbn గారి అరెస్ట్ చాలా బాధాకరం.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి గారి నాయకత్వంలో మంత్రిగా పని చేశాను... వారి అరెస్ట్ వ్యక్తిగతంగా నాకెంతో బాధను కలగచేసింది.
అధికారం శాశ్వతం కాదు....ఒకప్పుడు కేంద్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడి గారి పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరం.
సుమారు 73 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదు.
ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు.
@naralokesh అంటూ తలసాని చేసిన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.