#GunturKaaramStrikesin100Days అంటూ అప్పుడే మహేష్ అభిమానులు హాష్ టాగ్ తో సోషల్ మీడియాలో రచ్చ షురూ చేసారు. మహేష్-త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ మూవీగా మొదలైన గుంటూరు కారం విడుదలకు ఈ రోజుకి కేవలం 100 రోజులు మాత్రమే సమయం ఉంది. అక్టోబర్ చివరికల్లా టాకి పార్ట్ పూర్తయితే.. తర్వాత సాంగ్స్ చిత్రికరణ మొదలు పెడుతుంది టీం, ఓ పాట కోసం టీం విదేశాలకి వెళతారంటూ సోషల్ మీడియాలో అప్ డేట్స్ కనిపిస్తున్నాయి.
నిర్మాత నాగ వంశి కూడా జనవరి 13 న ఖచ్చితంగా గుంటూరు కారంతో అభిమానులు థియేటర్స్ లో విజిల్స్ వేస్తూ పండగ చేసుకుంటారంటూ చెబుతున్నారు. మరోపక్క దసరా కన్నా ముందే గుంటూరు కారం మెలోడీ రెడీ అంటున్నారు. #GunturKaaram మెలోడీ సాంగ్ అయితే రెడీ చేశారు. కానీ ఆ సాంగ్ ని షూట్ చేయాల్సి ఉంది. లిరికల్ వదలాలంటే కనీసం సాంగ్ విజువల్స్, స్టిల్స్ అయినా ఉండాలి కదా..! మరి టీమ్ ఏం చేస్తారో ? అని ఓ జర్నలిస్ట్ ట్వీటేసాడు.
అంతలోనే సాంగ్ బాగా వచ్చిందని, థమన్ మ్యూజిక్ అందించిన ఆ సాంగ్ తివిక్రమ్-మహేష్ లకి లకు బాగా నచ్చిందని.. అంటూ మరో ట్వీట్ కనిపించింది. మరి కచ్చితంగా లిరికల్ వీడియో తో పాటుగా విజువల్ ట్రీట్ కూడా గుంటూరు కారం నుంచి ఉంటుంది అని మహేష్ ఫాన్స్ అయితే బలంగా ఫిక్సవుతున్నారు.