Advertisementt

సూపర్ స్టార్ కొత్త లుక్ అదిరింది

Wed 04th Oct 2023 12:41 PM
rajinikanth  సూపర్ స్టార్ కొత్త లుక్ అదిరింది
Thalivar 170 shoot begins today సూపర్ స్టార్ కొత్త లుక్ అదిరింది
Advertisement
Ads by CJ

జైలర్ తో ప్యాన్ ఇండియా హిట్ కొట్టిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు ఆ సక్సెస్ తో మరో ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు. టీ జె జ్ఞ్యానవేల్ దర్శకత్వంలో భారీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చెయ్యడమే ఈ చిత్రంలోని పలు నటులని ఎంపిక చేసి మరీ ఈ ప్రాజెక్ట్ లోకి ఆహ్వానిస్తూ పోస్టర్స్ రిలీజ్ చేసారు. నిన్న మంగళవారం ఈ ప్రాజెక్ట్ లోకి పలు భాషల నటుల్ని తీసుకున్నట్టుగా పోస్టర్స్ తో అనౌన్స్ చేసారు. 

#Thalaivar 170 చిత్రంలో రానా, ఫహద్ ఫాజిల్, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ లు ఈ ప్రాజెక్ట్ లోకి వస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈరోజు సూపర్ స్టార్ రనీకాంత్ లుక్ ని రివీల్ చేస్తూ ఇచ్చిన అప్ డేట్ తో సోషల్ మీడియాలో సూపర్ స్టార్ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. ఆ పోస్టర్ లో సూపర్ ఫ్రెష్ లుక్ తో రజినీకాంత్ అదిరిపోయారు అని చెప్పాలి. రీసెంట్ సినిమాల కంటే సాలిడ్ గా తన వింటేజ్ టచ్ లో ప్రిపేర్ చేసిన తన ఈ లుక్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా మారింది. 

ఈ లుక్ తో పాటుగా మేకర్స్ ఇంకో అదిరే అప్డేట్ ని కూడా అందించారు. ఈరోజు అంటే బుధవారం నుంచే తాము ఏమాత్రం లేట్ చేయకుండా షూటింగ్ ని స్టార్ట్ చేస్తున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. 

Thalivar 170 shoot begins today:

Superstar Rajinikanth Thalivar170 shoot begins today

Tags:   RAJINIKANTH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ