ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్-కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కిన సలార్ మూవీ సందడి సోషల్ మీడియాలో భీభత్సంగా కనిపిస్తుంది. సలార్ డేట్ సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22 కి పోస్ట్ పోన్ అయినా ప్రభాస్ ఫాన్స్ మాత్రం సోషల్ మీడియాలో సలార్ రచ్చ ఇప్పుడే స్టార్ట్ చేసారు. సలార్ విడుదలకు రెండున్నర నెలల సమయం ఉంది.. అయినా అభిమానులు మాత్రం సలార్ రాక కోసం తెగ వెయిట్ చేస్తున్నారు.
ఇక ఇప్పుడు సలార్ ట్రైలర్ విషయంలోనూ ఓ క్లారిటీ వచ్చేసింది. సలార్ ట్రైలర్ ని మేకర్స్ రెడీ చేస్తున్నారు. దీనికి ముహూర్తం కూడా ఫిక్సయినట్లుగా తెలుస్తోంది. అది ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా ఈ అక్టోబర్ 23 కి సిద్ధం చేస్తున్నారని సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో ప్రభాస్ ఫాన్స్ హ్యాపీ మోడ్ లోకి వెళ్లిపోయారు. మోస్ట్ అవైటెడ్ సలార్ ట్రైలర్ ప్రభాస్ బర్త్ డే కి బ్లాస్ట్ అవ్వనుంది అని వారు పండగ చేసుకుంటున్నారు.
ఇక రీసెంట్ గా సలార్ లోకి కొన్ని సన్నివేశాలు ప్రశాంత్ నీల్ కి సంతృప్తినివ్వకపోవడంతో ఆ సన్నివేశాలను సీక్రెట్ గా రీ షాట్ చేశారనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇక ఈ సన్నివేశాలు సినిమాలో హైలెట్స్ గా నిలుస్తాయని చెబుతున్నారు.