పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన సలార్ మూవీ డిసెంబర్ 22కి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే సలార్ పోస్ట్ పోన్ అవడానికి కారణం ఏదో సీజీ వర్క్ అన్నారు కానీ.. ప్రశాంత్ నీల్ సలార్‌లోని కొన్ని సన్నివేశాలకు తను సంతృప్తి పడలేదు కాబట్టి రీ షూట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే సలార్ పార్ట్ 1 ని పోస్ట్ పోన్ చేశారనే విషయం ఇప్పుడు రివీల్ అయ్యింది.
సలార్‌లోని కొన్ని సన్నివేశాల చిత్రీకరణ అత్యంత పకడ్బందీగా.. సినిమా యూనిట్‌లోని అత్యంత ముఖ్యమైన వారిని మాత్రమే సెట్‌లో వుంచి మరీ చిత్రీకరించారు అని, సినిమాలో ఆ సన్నివేశాలు హైలైట్‌గా వుండబోతున్నాయి అంటూ సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ చూసి ప్రభాస్ ఫాన్స్ మైమరిచిపోతున్నారు. కొంతమంది మళ్ళీ రీ షూట్ ఏంటి బాసు అంటూ దీర్ఘాలు తీసేవారు లేకపోలేదు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్‌ని పర్ఫెక్ట్‌గా ప్రేక్షకులకి ప్రెజెంట్ చేయాలని.. ఇంకా ఇంకా చెక్కుతూనే ఉన్నారట. దానికోసమే ఇంత సమయం తీసుకుంటున్నారట. ఫైనల్ అవుట్ ఫుట్‌తో డిసెంబర్ 22న థియేటర్స్ బ్లాస్ట్ అవడం ఖాయమంటున్నారు. మరోవైపు ఈ చిత్ర సంగీత దర్శకుడు ఈ సినిమాపై చేస్తున్న కామెంట్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇది ఇంతకు ముందు ప్రశాంత్ నీల్ చేసిన ఉగ్రం సినిమాకు రీమేక్ అంటూ ఆయన పదే పదే చెబుతుండటంతో.. ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.