మహేష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతోన్న గుంటూరు కారం మూవీ సంక్రాంతికి వస్తుంది అంటూ రిలీజ్ డేట్ లాక్ చేసినా.. మహేష్-త్రివిక్రమ్ షూటింగ్ చూసి అది జరగదని చాలామంది అనుకున్నారు.. అనుకుంటున్నారు. అటు సూపర్ స్టార్ అభిమానులు కూడా ఇదే విషయంపై ఆందోళనలో ఉన్నారు. కానీ నిర్మాత నాగ వంశీ మాత్రం గుంటూరు కారం సంకాంతికే వస్తుంది నన్ను నమ్మండి.. అంటూ మీడియా ముందు చెబుతున్నారు.
తాజాగా అయన నిర్మించిన ఓ మూవీ ఈవెంట్‌లో నాగ వంశీ సూపర్ స్టార్ ఫాన్స్‌కి కిక్కిచ్చే అప్‌డేట్ ఇచ్చారు. పక్కాగా జనవరి 12న గుంటూరు కారం థియేటర్స్‌లో ఉంటుందని అన్నారు. మీరు సెలెబ్రేషన్స్‌కి సిద్ధమవ్వండి. అంతేకాదు గుంటూరు కారం నుండి ఫస్ట్ సాంగ్‌ని దసరా కంటే ముందే రిలీజ్ చేస్తాం అంటూ చెప్పారు. అలాగే గుంటూరు కారం లో మహేష్ బాబు గారు చాలా రోజుల తరువాత ఫుల్ ఎనర్జిటిక్ రోల్‌లో కనిపిసున్నారంటూ అదిరిపోయే న్యూస్ చెప్పారు.
సంక్రాంతికి సూపర్ ఫ్యాన్స్ గుంటూరు కారంతో పెద్ద సంబరం చేసుకోవడం ఖాయం అంటూ హైప్ క్రియేట్ చేశారు. మరి ఇది మహేష్ అభిమానులకి సూపర్ హ్యాపీ న్యూస్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న గుంటూరు కారం ఫస్ట్ సింగిల్‌ని థమన్ రెడీ చేస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.