దేవర మూవీ షూటింగ్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న ప్యాన్ ఇండియా ఫిలిం దేవర షూటింగ్ అనుకున్నట్టుగా అనుకున్న సమయానికే పూర్తవుతుంది. షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ తో షూటింగ్ ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా దేవర DOP రత్నవేలు ట్విట్టర్ వేదికగా ఒక భారీ అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసినట్టుగా సోషల్ మీడియాలో ఒక పోస్టు ట్టాడు. ఆ పోస్ట్ ఎన్టీఆర్ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చింది.
దానితో దేవరని ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈలోపులో సడన్ గా వార్ 2 హాష్ నాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవడం చూసి ఎన్టీఆర్ ఫాన్స్ మామూలోళ్లు కారు అనుకున్నారు. కానీ వార్ 2 అంత సడన్ గా ట్రెండ్ అవడానికి కారణం వార్ 2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీని.
ఎన్టీఆర్-హ్రితిక్ రోషన్ కలయికలో అయన్ ముఖర్జి హిందీలో వార్ 2 అనౌన్స్ చేసాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న అయాన్ అతి త్వరలోనే వార్-2 షూట్ మొదలు పెడతారని తెలుస్తుంది. ఈలోపులో ఆయన ఒకసారి ఎన్టీఆర్ ని మీటవ్వడానికి హైదరాబాద్ రావడమే ట్విట్టర్ లో వార్ 2 హాష్ టాగ్ ట్రెండ్ అవడానికి కారణమైంది.
అయాన్ ముఖర్జీ తాజాగా హైదరాబాద్‌కు వచ్చాడు. దేవర సెట్స్‌లోనే అతను ఎన్టీఆర్‌ను కలిసినట్లు తెలుస్తోంది. వార్ 2 కి సంబందించిన విషయాలు, ప్రీ ప్రొడక్షన్ వర్క్ గురించి మాట్లాడేందుకు ఎన్టీఆర్ ని కలవడానికి అయాన్ ముంబై నుంచి హైదరాబాద్ వచ్చాడని సమాచారం.