అసలే సౌత్ లో బిగ్ బాస్ కి ఆడియన్స్ ఆదరణ కరువైంది. గత మూడు సీజన్స్ నుంచి బిగ్ బాస్ ని చూసే ప్రేక్షకులు కరువయ్యారు. నాగార్జున హోస్టింగ్ కూడా బోర్ కొట్టేస్తుంది, వీక్ డేస్ మాత్రమే కాదు.. వీకెండ్ ఎపిసోడ్స్ కూడా బోర్ కొట్టేస్తున్నాయి అనే మాట సోషల్ మీడియాలోనే కాదు.. చాలామంది బుల్లితెర ప్రేక్షకులు తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు. పూర్ టిఆర్పీ తో బిగ్ బాస్ రన్ అవుతుంది.
మరోపక్క వరసగా లేడీ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడంపై కూడా నెటిజెన్స్ నుంచి ట్రోలింగ్ మొదలైంది. అందులోను నిన్న రతిక ఎలిమినేషన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హౌస్ లో టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్ లు హౌస్ లో ఎంటర్టైన్ చెయ్యడమే లేదు. శివాజీ అయితే కంటెస్టెంట్ గా కూడా పనిరాడు.. ఆయన పంచాయితీలు చేస్తూ, ఏదో అలా అలా మేనేజ్ చేస్తున్నాడు. అలాంటివాళ్ళని ఎలిమినేట్ చెయ్యకుండా రతికని ఎలిమినేట్ చెయ్యడమేమిటి?
అసలు రతిక రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తో స్నేహం, అతనితో వైరమే ఆమె కొంపముంచింది, అనవసరపు అతి ఆమెని ఎలిమినేట్ అయ్యేలా చేసింది.
కానీ ఆమె టాస్క్ ఆడకపోయినా కనీసం తాను ఎవరి మీద ఆధారపడకుండా ఇండివిడ్యువల్ గా ఆడుతుంది. ఆలోచన శక్తి లేని యావర్.. బద్దకానికి కేరాఫ్ టేస్టీ తేజ, టాస్క్ ఆడని శివాజికి కన్నా రతిక చాలా బెటర్ అంటూ నెటిజెన్స్ బిగ్ బాస్ యాజమాన్యాన్ని ట్రోల్ చేస్తున్నారు.