నందమూరి నటసింహ బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో అక్టోబర్ 19 న విడుదల కాబోతున్న భగవంత్ కేసరి విడుదల పై ఉన్న అనుమానాలని టీం ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ పోతుంది. రాజకీయాలతో బాలయ్య బాబు బిజి కావడంతో భగవంత్ కేసరి విడుదల తేదీపై రకరకాల అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. కానీ చిత్ర బృందం మాత్రం వాటిని ఖండిస్తూ వస్తుంది.
దానికి అనుగుణంగానే భగవంత్ కేసరి ప్రమోషన్స్ మొదలు పెట్టేందుకు సిద్దమవుతున్నారు. ముందుగా భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ చేసి.. దాని మీద వచ్చే హైప్ ని సినిమా విడుదల అయ్యేవరకు ఉంచాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు. అక్టోబర్ 8 న భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ నిర్వహించాలని అనుకుంటున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన ఇస్తారని తెలుస్తుంది. ఈ చిత్రంలో బాలయ్య పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉన్నా.. బాలయ్య పాత్ర తాలూకు ఆలోచనలు, యాక్టివిటీస్ చాలా సరదాగా సాగుతాయట. బాబాయ్-కూతురు మధ్య ఉండే ఎమోషనల్ ట్రాక్ తో భగవంత్ కేసరి ట్రైలర్ కట్ ఉండబోతుంది అని తెలుస్తోంది.. శ్రీలీల బాలయ్యకి అన్న కుమార్తెగా కనిపిస్తుండగా.. కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.