కోలీవుడ్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు పునాదులు పటిష్టంగా వేస్తున్నట్లుగా పలు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అభిమానులతో మీటింగ్స్ పెట్టడం, పలు సేవా కార్యకలాపాల్లో పాల్గొనడం ఇవన్నీ చూస్తుంటే విజయ్ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేయబోతున్నాడని, పార్టీ పెట్టడం గ్యారెంటీగా కనిపిస్తుంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.
గాంధీ జయంతి సందర్భంగా తమిళనాడులోని ప్రతి ఊరు, వాడలోని గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి సమర్పించాలని అభిమానులకి సంఘం కార్యకర్తలకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అభిమాన సంఘాలు, ప్రజా సంఘాలు పాల్గొనాలని.. స్వాతంత్య్రం కోసం పాటుపడిన జాగుల జిల్లాకి వెళ్లి వాళ్ళని సత్కరించాలి విజయ్ పిలుపునిచ్చినట్టుగా ప్రజా సంఘం అధ్యక్షుడు బుస్సి ఆనంద్ మీడియాకి తెలియజేసారు.