Advertisementt

N‘BK’ ఎమోషనల్ టచ్ ఎప్పుడంటే..

Tue 03rd Oct 2023 10:44 AM
bhagavanth kesari,balakrishna,second single,tollywood  N‘BK’ ఎమోషనల్ టచ్ ఎప్పుడంటే..
Bhagavanth Kesari Second Single Uyaalo Uyyaala Release Update N‘BK’ ఎమోషనల్ టచ్ ఎప్పుడంటే..
Advertisement
Ads by CJ

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాపై కొన్ని రూమర్స్ వైరల్ అవగా.. వాటన్నింటికి ఓ పవర్‌ఫుల్ వీడియోతో మేకర్స్ సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. 

దసరా బరిలో నుంచి ఈ సినిమా తప్పుకుందనే రూమర్స్‌కి బ్రేక్ వేస్తూ.. మేకర్స్ వదిలిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉండగానే.. తాజాగా మేకర్స్ మరో అప్‌డేట్‌ని వదిలారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రతీది మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా భగవంత్ కేసరి సినిమాలోని ఎమోషనల్ టచ్‌ని పరిచయం చేసేందుకు మేకర్స్ సెకండ్ సింగిల్‌ని వదలబోతున్నారు. మాస్ ఫీస్ట్ తర్వాత, ఎమోషనల్ రైడ్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ.. రెండో సింగిల్ అప్‌డేట్‌ని మేకర్స్ వదిలారు.

ఉయ్యాలో ఉయ్యాలా అంటూ సాగే ఈ పాటని అక్టోబర్ 4న విడుదల చేయబోతున్నారు. ఈ పాట భగవంత్ కేసరి బంధాన్ని తెలియజేసేలా మేకర్స్ వదిలిన పోస్టర్‌లో 

టీజర్‌ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ వరకు ప్రమోషనల్‌ మెటీరియల్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మాస్ ఫీస్ట్ తర్వాత, ఎమోషనల్ రైడ్ కోసం సిద్ధంగా ఉండండి. బాలకృష్ణ నది ఒడ్డున కూర్చుని పాపతో సరదాగా గడుపుతున్నట్లు కనిపించింది. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ క్రష్ శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. జాతీయ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి విలన్‌గా అడుగుపెడుతున్నారు.

Bhagavanth Kesari Second Single Uyaalo Uyyaala Release Update:

Bhagavanth Kesari Emotional Touch on Oct 04

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ