Advertisementt

టైగర్ నాగేశ్వరరావులో రేణు దేశాయ్ లుక్

Mon 02nd Oct 2023 08:34 AM
renu desai,hemalatha lavanam,tiger nageswara rao,ravi teja  టైగర్ నాగేశ్వరరావులో రేణు దేశాయ్ లుక్
Renu Desai Look From Tiger Nageswara Rao Out టైగర్ నాగేశ్వరరావులో రేణు దేశాయ్ లుక్
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మళ్లీ నటిగా కెరీర్‌ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ ఓపెనింగ్ రోజు రేణు దేశాయ్ హడావుడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని రేణు దేశాయ్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో హేమలత లవణంగా రేణు దేశాయ్ కనిపించనుంది.

హేమలత లవణం ఫస్ట్ లుక్ విషయానికి వస్తే.. ఇందులో రేణు దేశాయ్ ఓ పసిబిడ్డని కన్నతల్లి ఎంత ప్రేమగా చూసుకుంటుందో అలా.. తీక్షణంగా చూస్తూ ఆనందంగా ఉంది. ఈ లుక్ చూస్తుంటే.. ఇందులో ఆమె చేస్తున్నది ఓ స్ఫూర్తిదాయకమైన పాత్ర అనేది అర్థమవుతోంది. ప్రస్తుతం రేణు దేశాయ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా తర్వాత.. రేణు దేశాయ్ మరింత బిజీ అయ్యే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ల కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా టైగర్ నాగేశ్వరరావు చిత్రం తెరకెక్కుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 3న ఈ చిత్ర ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించి ఉన్నారు. రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Renu Desai Look From Tiger Nageswara Rao Out :

Renu Desai Plays Hemalatha Lavanam Role in TNR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ