Advertisementt

మొన్న ప్రభాస్.. ఇప్పుడు మోహన్ లాల్

Sun 01st Oct 2023 07:47 PM
kannappa,mohan lal,manchu vishnu,prabhas  మొన్న ప్రభాస్.. ఇప్పుడు మోహన్ లాల్
Superstar Mohan Lal in Vishnu Manchu Project Kannappa మొన్న ప్రభాస్.. ఇప్పుడు మోహన్ లాల్
Advertisement
Ads by CJ

మంచు ఫ్యామిలీ హీరో విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రేంజ్ రోజురోజుకు మారిపోతుంది. మొన్నీ మధ్య ఈ సినిమా గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఓ కీలక పాత్ర చేస్తున్నట్లుగా వార్తలు రావడం, వెంటనే మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా అది నిజమే అని కన్ఫర్మ్ చేయడంతో.. కన్నప్ప ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. మొదటి నుంచి ఈ సినిమాలో ఎందరో స్టార్స్ నటించబోతున్నారని విష్ణు చెప్పినట్లే.. ఇప్పుడు ఇంకో స్టార్ ఈ సినిమాలో యాడ్ అయ్యారు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. మలయాళ సూపర్ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్.

అవును.. మోహన్ లాల్ ఈ సినిమాలో భాగం కాబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన, ఫొటో కూడా వచ్చేసింది. కన్నప్ప సినిమాలో ఓ ముఖ్య పాత్రను మోహన్ లాల్ పోషించబోతున్నారు. ఈ మేరకు మంచు విష్ణు రీసెంట్‌గా మోహన్ లాల్‌ను కలవడం.. ఆయన ఓకే చేయడం.. అనంతరం వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టడం వెంటనే వెంటనే జరిగిపోయాయి. దీంతో ఇప్పుడీ ప్రాజెక్ట్‌ గురించి అంతా మాట్లాడుకోవడం మొదలెట్టారు. కారణం.. ఇంకా ఎంత మంది స్టార్ ఈ సినిమాలో భాగం కాబోతున్నారు.. ఎవరెవరు ఈ సినిమాకు ఓకే చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. చూద్దాం.. కన్నప్ప నుంచి ఇంకా ఎటువంటి అప్‌డేట్స్ రాబోతున్నాయో.. 

కన్నప్ప పాన్ ఇండియా సినిమాగా మంచు విష్ణు భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. మంచు విష్ణు ఈ సినిమాను భారీ ఎత్తున అత్యంత ప్రతిష్టాత్మకంగా, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో నిర్మించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కన్నప్ప టీం న్యూజిలాండ్‌లో ఉంది.

Superstar Mohan Lal in Vishnu Manchu Project Kannappa:

After Prabhas, Mohan Lal in Kannappa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ