Advertisementt

దేవర హిట్టయితే ఎన్టీఆర్ ఖాతాలో రికార్డ్!

Sun 01st Oct 2023 04:14 PM
devara,record,young tiger ntr,koratala siva  దేవర హిట్టయితే ఎన్టీఆర్ ఖాతాలో రికార్డ్!
Young Tiger Starring Devara Interesting Updates దేవర హిట్టయితే ఎన్టీఆర్ ఖాతాలో రికార్డ్!
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషనే సూపర్ హిట్. ఇక వీరిద్దరి కాంబోలో వస్తున్న దేవరపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అంతకుముందు కొరటాల శివ చేసిన ఆచార్య మూవీ ఫ్లాప్ అవడంతో దేవర చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్నారు. ప్రతి సీన్‌ని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారట. ప్రస్తుత షెడ్యూల్‌లో భాగంగా ఈ చిత్రంలో ఒక కీలక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. 

ఈ యాక్షన్ సీక్వెన్స్ మొత్తం సముద్రంలోనే ఉంటుందని టాక్. దీనికి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ సారధ్యం వహిస్తున్నారట. ఈ సినిమాలో ఊర మాస్ లుక్‌లో ఎన్టీఆర్ దర్శనమివ్వబోతున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌కి భారీ పోటీ ఏర్పడిందట. చివరకు నెట్‌ఫ్లిక్స్ రూ.90 కోట్లకి దక్కించుకుందని సమాచారం. నిజానికి ఇది చాలా పెద్ద విషయం. 

ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఎన్టీఆర్ కూడా అంతకు మించి ఉండాలని చాలా ఛాలెంజింగ్‌గా ఈ సినిమా చేస్తున్నాడని సమాచారం. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సినిమా కానీ హిట్ అయ్యిందో.. ఎన్టీఆర్ ఖాతాలో వరుస హిట్స్ సంఖ్య 7కు చేరుకుంటుంది. నిజానికి ఇటీవలి కాలంలో అయితే ఇలా వరుసగా ఏడు హిట్స్ అనేవి ఏ హీరో ఖాతాలో పడలేదనే చెప్పాలి. దీంతో ఎన్టీఆర్ ఖాతాలో దేవర హిట్ అయితే మాత్రం సరికొత్త రికార్డ్ పడినట్టే. కొరటాలకు కూడా ఈ సినిమా మంచి బూస్ట్ అవుతుంది. ఇక ఈ సినిమా ద్వారా తొలిసారిగా జాన్వీ కపూర్ టాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది.

Young Tiger Starring Devara Interesting Updates:

Devara Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ