సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార సినిమా ప్రమోషన్స్ వైపు కూడా చూడరన్న విషయం తెలిసిందే. ఈ కండీషన్‌తోనే ఆమె సినిమా చేస్తారట. అయితే అసలు ఆమె సినిమా ప్రమోషన్స్‌కి ఎందుకు రారనేది బిగ్ సస్పెన్స్. ఆమె భర్త విఘ్నేష్ శివన్ తాజాగా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. 9స్కిన్ అనే బ్రాండ్ నేమ్‌తో స్కిన్ కేర్ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే పలు దేశాల్లో పర్యటిస్తూ తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్నారు. ఈ బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల నయన్ దంపతులు మలేషియా వెళ్లారు.
మలేషియాలో విఘ్నేష్ శివన్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నయన్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అసలు నయన్ ఎందుకు సినిమా ప్రమోషన్స్‌కి హాజరు కారో కూడా వెల్లడించారు. నయన్ చాలా విషయాల్లో తనలో స్ఫూర్తి నింపిందన్నారు. మనస్ఫూర్తిగా నమ్మితే దేనినైనా ప్రచారం చేయడానికి నయన్ ముందుకు వస్తుందన్నారు. అలాగే తాను నటించిన సినిమాలో మంచి కంటెంట్ ఉందంటే అది తప్పకుండా హిట్ అవుతుందని జనంలో నమ్ముతుందని విఘ్నేశ్ శివన్ తెలిపారు. అందుకే ఆమె ప్రమోషన్స్‌కి దూరమని వెల్లడించారు.
9 స్కిన్ బ్రాండ్ ఉత్పత్తులన్నింటినీ తొలుత నయన్ స్వయంగా వాడి చూశారని విఘ్నేశ్ శివన్ తెలిపారు. డిజైన్, బాటిల్, స్టైల్, ప్యాకింగ్ ఇలా ప్రతి విషయాన్నీ ఆమె దగ్గరుండి చేయించిందట. ఈ బ్రాండ్ కోసం చాలా కష్టపడి పని చేసిందని ఈ క్రమంలోనే దాని ప్రమోషన్స్‌లో సైతం పాల్గొంటోందని విఘ్నేశ్ శివన్ వెల్లడించారు. ప్రతి చిన్న విషయంలోనూ నయన్ చాలా నిబద్ధతతో పని చేస్తుందని చెప్పుకొచ్చారు. విఘ్నేష్ తొలి చిత్రం ‘నేనూ రౌడీనే’లో నయన్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్ర సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వీరికి సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలు జన్మించిన విషయం కూడా తెలిసిందే.