Advertisementt

బాలయ్య కోసమేనా ఇదంతా?

Fri 29th Sep 2023 01:40 PM
skanda  బాలయ్య కోసమేనా ఇదంతా?
All this for Balayya? బాలయ్య కోసమేనా ఇదంతా?
Advertisement
Ads by CJ

బోయపాటికి బాలయ్య సెట్ అయినట్లుగా మరే హీరో సెట్ కారు అనే విషయాన్ని ఆయన చాలాసార్లు నిరూపిస్తూనే వచ్చారు. బాలకృష్ణ తో పొలిటికల్ డైలాగ్స్ అయినా.. యాక్షన్ సీన్స్ అయినా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. బోయపాటి మార్క్ యాక్షన్, డైలాగ్స్ అన్ని బాలయ్యకి అనుకూలంగా ఉంటాయి. కానీ ఇప్పుడు బాలయ్యని వదిలేసి బోయపాటి రామ్ తోనూ బాలయ్యకి సెట్ అయ్యే డైలాగ్స్ రాయడమే హాట్ టాపిక్ అయ్యింది. 

రామ్ తో  రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లపై ఇండైరెక్ట్ పంచ్ లు వేసి అందరిని షాక్ కి గురి చేసారు. అవసరం ఉన్నా లేకపోయినా బోయపాటి  డైలాగ్స్  కొంతమందికి అర్ధం కాకపోయినా.. కొంతమంది మాత్రం బాలయ్య తో చెప్పించాల్సిన డైలాగ్స్ రామ్ తో చెప్పించారు అంటున్నారు. రచ్చ రవితో ఉచిత పథకాలంటూ ఏపీ సీఎం పై ఇండైరెక్ట్ సెటైర్ వేయించడం, లాయర్ సన్నివేశాలు ఇవన్నీ పొలిటికల్ పంచ్ లే. 

రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లపై పేల్చిన పొలిటికల్ పంచ్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. బాలయ్య తో ఆ డైలాగ్స్ చెప్పించాడు అంటే అది బాలకృష్ణ కావాలనే పెట్టించుకున్నారు అనుకోవచ్చు. కానీ రామ్ తో బోయపాటి ఇలాంటి పొలిటికల్ పంచాయితీ పెట్టక్కర్లేదు. కానీ పెట్టాడు. బాలయ్య లేకపోయినా నేను బాలయ్య మనిషినే అని బోయపాటి నిరూపించారు.

All this for Balayya?:

Boyapati Sreenu includes political satires in Skanda

Tags:   SKANDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ