Advertisementt

ఫైనల్లీ సలార్ డేట్ లాక్ చేసేసారు

Fri 29th Sep 2023 11:42 AM
salaar  ఫైనల్లీ సలార్ డేట్ లాక్ చేసేసారు
Date Locked For Salaar Mayhem ఫైనల్లీ సలార్ డేట్ లాక్ చేసేసారు
Advertisement
Ads by CJ

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్-ప్యాన్ ఇండియా  డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న సలార్ అసలైతే నిన్న సెప్టెంబర్ 28 న విడుదల కావాల్సి ఉంది. కానీ టెక్నీకల్ ఇష్యుస్ తో సలార్ ని పోస్ట్ పోన్ చేసారు మేకర్స్. కొత్త రిలీజ్ డేట్ విషయంలో నవంబర్, డిసెంబర్ అంటూ ప్రచారం జరిగినా నాలుగు రోజుల ముందు నుంచి సలార్ డిసెంబర్ 22 న విడుదలకాబోతుంది అనే ప్రచారం షురూ అయ్యింది. కానీ మేకర్స్ కాస్త లేట్ తో రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యడంతో అటు ఇండస్ట్రీలోకి కొంతమంది హీరోలతో పాటుగా ఇటు ఫాన్స్ కూడా డిస్పాయింట్ అవుతూ ఉన్నారు. 

అయితే నిన్న సలార్ చూసిన కళ్ళతో స్కంద చూసాము.. సలార్ తో సెలెబ్రేట్ చేసుకోవాల్సిన మేము ఇలా అంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ డిస్పాయింట్ మోడ్ లో కనిపించారు. అందుకే వారిని యాక్టీవ్ చెయ్యడానికిగాను.. ఈరోజు శుక్రవారం సలార్ డేట్ ని లాక్ చేసి అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. 

అది నిన్నటివరకు ప్రచారం జరిగినట్టుగా డిసెంబర్ 22 నే డైనోసార్ దిగుతుంది అంటూ డేట్ పోస్టర్ తో సలార్ మేకర్స్ హోంబులే ఫిలిమ్స్ వారు ప్రకటించారు. మరి సలార్ రాకతో ఎంతమంది హీరోలు కొత్త డేట్స్ ని లాక్ చేసుకుంటారో చూడాలి. నాని ,నితిన్, వెంకటేష్ లు తమ సినిమాల డేట్స్ మార్చుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. 

Date Locked For Salaar Mayhem:

Salaar Hitting The Screens Worldwide On 22nd December

Tags:   SALAAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ