2024 సంక్రాంతికి ఈసారి బాక్సాఫీస్ ఫైట్ అదిరిపోయేలా కనబడుతుంది. ప్రభాస్ కల్కి సంగతి ఎలా ఉన్నా.. మహేష్ గుంటూరు కారం మాత్రం సంక్రాంతికి టార్గెట్ ఫిక్స్ చేసుకుని దానికి అనుగుణంగా షూటింగ్‌ని పూర్తి చేసే పనిలో మహేష్ మరియు త్రివిక్రమ్ ఉన్నారు. ఇక ఎప్పటినుంచో సంక్రాంతికి బరాబర్ అని చెబుతున్న రవితేజ ఈగల్‌ని సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసి జనవరి 13 అంటూ అఫీషియల్ డేట్ ఇచ్చేసారు. కింగ్ నాగార్జున కూడా రికార్డ్ డేస్‌లో నా సామిరంగా అంటూ సంక్రాంతికి సిద్ధమవుతున్నాడు.
అటు విజయ్ దేవరకొండ కూడా దిల్ రాజు-పరశురామ్ పెట్ల మూవీని సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రకటించాడు. అక్కడ దిల్ రాజుకి సంక్రాంతికి సెంటిమెంట్ ఉంటుంది. అందుకే వారూ తగ్గరు. మరోవైపు మల్టీ లాంగ్వెజెస్‌లో రూపుదిద్దుకుంటున్న హను-మాన్‌కి కూడా సంక్రాంతికి ఖర్చీఫ్ వేసి ఉంచారు. ఇలా సంక్రాంతి బాక్సాఫీసు ఫైట్ అంతకంతకు పెరిగిపోతూ ప్రేక్షకుల్లో ఆత్రుతని ఇంకా ఇంకా ఎక్కువ చేస్తున్నాయి.
మరి ఆ సమయానికి ఎన్ని బరిలో ఉంటాయో.. ఎన్ని తప్పుకుంటాయో అనేది పక్కనబెడితే.. సంక్రాంతి 2024 ని మాత్రం బాగా టైట్ చేస్తున్నారు. ఇక తమిళ, కన్నడ, మలయాళం నుంచి ఎన్ని సినిమాలు ఆ సమయానికి వచ్చి చేరుతాయో.. అనే మాట కూడా వినిపిస్తోంది.