జబర్దస్త్‌లో కామెడీ చేసి కిర్రాక్ ఆర్పీ పేరుతో పాపులర్ అయిన ఆర్పీ ఆ తర్వాత వేరే ఛానల్‌కి వెళ్ళిపోయి జబర్దస్త్ పై సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యడమే కాదు.. యాజమాన్యం పైనా నిందలు వేశాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారుతున్నాను అంటూ కథలు చెప్పి ఆఫీస్ తీసి చివరికి ఆఫీస్ మూసేసి ఆ తర్వాత నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ హల్ చల్ చేశాడు. కూకట్ పల్లి మొదలు అనంతపురం వరకు కిర్రాక్ ఆర్పీ చేపల పులుసు ఫేమస్ అయ్యింది.
దానితో కిర్రాక్ ఆర్పీనుంచి చేపల పులుసు ఆర్పీగా మారాడు. అయితే ఆర్పీ చేపల పులుసు పాయింట్స్‌ని పాపులర్ చేసేసింది కేవలం యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే. వారు చేసిన పబ్లిసిటీతోనే కిర్రాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చాలా త్వరగా జనాల్లోకి వెళ్ళింది. అయితే ఆర్పీ కర్రీ పాయింట్ దగ్గర చేపల పులుసు రేటు చాలా ఎక్కువనే మాట వినిపిస్తోంది.
కిర్రాక్ ఆర్పీ దగ్గర కొరమీను చేపల పులుసు 1800 రూపాయలట. కేజీ అక్షరాలా 1800 వందలట. అమ్మో నాలుగు కేజీల కొర్రమీను చేపలు కొనుక్కొవచ్చు. అంత కాస్ట్లీ చేపల కూర అని ఆర్పీని అడిగితే తోక, తల వెయ్యకుండా కేజీ మధ్య ముక్కలు వేసి పులుసు పెట్టి దానిని నేను 1800 లకి అమ్ముతున్నాను. అందులో చింతపండు, ఉప్పు, కారం, మసాలాలు, ఆయిల్ ఖర్చు కూడా ఉంటుంది.
కేజీ కొరమీను బయట 400 నుంచి 500 ఉంటుంది. నేను రెండు కేజీలు చేస్తేనే అది కేజీ చేపల పులుసు అవుతుంది. అందులో వేసేవి అన్ని కలిపి నేను 1800 లకి కొరమీను చేపల పులుసు అమ్ముతున్నాను అంటూ ఆర్పీ చాలా ఈజీగా చెప్పినా.. చేపల పులుసు కోసం 1800 వెచ్చించడం అనేది సామాన్యుడివల్లైతే కాదు కదా..