సూపర్ స్టార్ రజినీకాంత్ - వాసు కలయికలో వచ్చిన చంద్రముఖి అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా రాఘవ లారెన్స్ కంగనాతో కలిసి చంద్రముఖి 2 అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చేసాడు. జ్యోతిక చంద్రముఖి గా అందరిని భయపెట్టింది. మరి బాలీవుడ్ క్వీన్ కంగనా చంద్రముఖిగా ఎలాంటి పెరఫార్మెన్స్ ఇచ్చిందో, రాఘవ సూపర్ స్టార్ ని మరిపించాడా, ప్యాన్ ఇండియా మూవీ గా సెప్టెంబర్ 28న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఆడియన్స్ కి ఎంతవరకు రీచ్ అయ్యింది అనేది చంద్రముఖి ఓవర్సీస్ పబ్లిక్ టాక్ లో చూసేద్దాం.
రాఘవ లారెన్స్ రెండు డిఫ్రెంట్ షేడ్స్ లో కనిపించారు, కాకపోతే రజినీకాంత్ తో పోలిస్తే.. రాఘవ లారెన్స్ నటన తేలిపోయిందనే కామెంట్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ లో లారెన్స్ పెరఫార్మెన్స్ ఫైర్ అంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ లో కంగనరనౌత్ కనిపించలేదట. పీ వాసు కథను నడిపించిన తీరు సినిమాకు పెద్ద ప్లస్ అంటున్నారు. స్క్రీన్ ప్లే సూపర్బ్ అని.. కొంతమంది మాట్లాడుతున్నారు.
ఎంఎం కీరవాణి సాంగ్స్ పర్వాలేదని, వడివేలు కామెడీ మాత్రం బాగా వర్కౌట్ అయింది. ఇక విజువల్స్ అలాగే మోషన్స్ కూడా వర్క్ అయినట్లు చెబుతున్నారు. కానీ నెమ్మదిగా సాగే కథనం ఇబ్బంది పెడుతుంది అంటూ చంద్రముఖి 2 పై ఓవర్సీస్ ఆడియన్స్ కామెంట్స్ ఉన్నాయి.