మాస్ డైరెక్టర్ బోయపాటి-ఎనెర్జిటిక్ హీరో రామ్ కలయికలో మొదటిసారిగా తెరకెక్కిన స్కంద మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. రామ్-శ్రీలీల కాంబినేషన్, బోయపాటి అఖండ హిట్, స్కంద రిలీజ్ ట్రైలర్, సాంగ్స్ అన్ని సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసాయి. సో సో ప్రమోషన్స్ అయినా.. సినిమాపై అటెన్షన్ క్రియేట్ చెయ్యడంలో రామ్ చాలావరకు సక్సెస్ అయ్యాడు. భారీ బడ్జెట్ తో భారీగా తెరకెక్కిన స్కంద కి సంబంధించి ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పడకపోయినా.. ఇండియాలో షో మొదలైనపపుడే ఓవర్సీస్ లో షోస్ మొదలయ్యాయి. హైదరాబాద్ లో మాత్రం ఉదయం 7 గంటలకే షో పడిపోయింది.
మరి స్కంద ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందొ ఓసారి చూసేద్దాం.. రామ్ పోతినేని బుల్ ఇంట్రడక్షన్ చూసి ఫాన్స్ విజిల్స్ వేస్తున్నారు. శ్రీలీల క్యూట్ గా కనిపించడమే కాదు డాన్స్ కుమ్మేసింది. యాక్షన్ సీన్స్ నెక్ట్ లెవెల్. తమన్ మ్యూజిక్, BGM అయితే వేరే లెవల్.. అంటూ స్కంద ఫస్ హాఫ్ రిపోర్ట్ తో నెటిజెన్స్ హడావిడి చేస్తున్నారు.
ఫస్ట్ ఆఫ్ లో రెండు భారీ మాస్ బ్లాక్స్ తో బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ బావుంది. ఇంటర్వెల్ సీన్ అదిరిపోయిందని ట్వీట్స్ పెడుతున్నారు. రామ్ ఎనర్జిటిక్ యాక్షన్ సినిమాని మరో రేంజ్ కి తీసుకెళ్లింది, ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉన్నా టోటల్ గా సినిమా బావుంది అని కొంతమంది ఆడియన్స్ అభిప్రాయపడుతుంటే, ఇంత వైలెంట్ కొంత మందికి నచ్చదు అంటూ మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు. రామ్ అభిమానులు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు, అస్సలు డిస్పాయింట్ అవ్వరు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు, ఫైనల్ టాక్ ఏమిటి అనేది మరికొద్దిసేపట్లో రివ్యూలో తెలుసుకుందాం.