పవన్ కళ్యాణ్ ప్రస్తుతం, ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే OG మూవీస్ కోసం డేట్స్ కేటాయిస్తున్నారు. హరీష్ శంకర్, సుజిత్ ఇద్దరు దర్శకులు పవన్ కళ్యాణ్ డేట్స్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటున్నారు. ఇప్పటికే OG ఫస్ట్ లుక్ టీజర్ తో సుజిత్ పవన్ ఫాన్స్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ సంపాదించాడు. అటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హాంగ్రీ చీతా అంటూ ఇచ్చిన ఎలివేషన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఫస్ట్ లుక్ టీజర్ కి అదిరిపోయింది.
తర్వాతలోనే OG నుంచి క్రేజీ అప్ డేట్ రాబోతుంది అని తెలుస్తోంది. హాంగ్రీ చీతా అనే లిరికల్ సాంగ్ రాబోతున్నట్లుగా ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ లిరికల్ OG సినిమాటోగ్రాఫర్ కే రవిచంద్రన్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. కే రవిచంద్రన్ థమన్ తో దిగిన ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ హాంగ్రీ చీతా అనే ఫస్ట్ సాంగ్ రాబోతోంది అంటూ ఇచ్చిన అప్ డేట్ తో పవన్ అభిమానులు ఊగిపోతున్నారు.
పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, హీరోయిన్ గా ప్రియాంక మోహనన్, అర్జున్ దాస్ లాంటి క్రేజీ స్టార్స్ భాగమయ్యారు. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే.. షూటింగ్ చాలా త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది మార్చి లో కానీ, ఏప్రిల్ కానీ సినిమాని విడుదల చెయ్యాలని దానయ్య-సుజిత్ ప్లాన్ చేసుకుంటున్నారు.