శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. యంగ్ అండ్ స్టార్ హీరోలతో జోడి కడుతున్న శ్రీలీల క్షణం తీరిక లేని బిజీ లైఫ్ ని గడుపుతుంది. రామ్ హీరోగా తెరకెక్కిన స్కంద తో రేపు గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత నెల అక్టోబర్ లో భగవంత్ కేసరితో బాలయ్య బాబుతో దిగబోతుంది. ఇక నవంబర్ లో ఆది కేశవ్ తో మరోమారు ఆడియన్స్ ని పలకరించబోతుంది.
ఇక డిసెంబర్లో నితిన్ ఎక్సట్రా మూవీతో రాబోతుంది, జనవరిలో వస్తే మహేష్ గుంటూరు కారం ఉంది. ఇక తర్వాత కూడా శ్రీలీల చాలా బిజీగా ఉంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే రవితేజ, విజయ్ దేవరకొండ మూవీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు శ్రీలీల డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక విజయ్ దేవరకొండ, రవితేజ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుంది అనే టాక్ నడుస్తున్న టైం లోనే రశ్మిక రవితేజ ప్రాజెక్ట్ లోకి వచ్చింది చేరింది. శ్రీలీల డేట్స్ ప్రాబ్లెమ్ రశ్మికకి లక్కీగా కలిసొచ్చింది.
ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాని కూడా శ్రీలీల వదులుకుంది అనే వార్త తర్వాత విజయ్ తో రశ్మిక మళ్ళీ రొమాన్స్ చేయబోతుంది అనే న్యూస్ హైలెట్ అయ్యింది. విజయ్ దేవరకొండ-రశ్మిక కలయికలోపరశురాం పెట్ల దర్శకత్వంలో ఆ మూవీ రాబోతుంది అని తెలుస్తుంది. మరి శ్రీలీల డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక తప్పుకున్న ప్రాజెక్ట్స్ లోకి రష్మిక వచ్చి లక్కీగా దూరిపోతుంది కదా!.