Advertisementt

బిగ్ బాస్ లో దెబ్బలు తగిలించుకున్న రైతు బిడ్డ

Wed 27th Sep 2023 04:48 PM
bigg boss 7  బిగ్ బాస్ లో దెబ్బలు తగిలించుకున్న రైతు బిడ్డ
Bigg Boss 7 today promo viral బిగ్ బాస్ లో దెబ్బలు తగిలించుకున్న రైతు బిడ్డ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్7 లో కంటెస్టెంట్స్ మధ్యన నామినేషన్స్ గొడవ హద్దులు దాటేస్తుంది. అలా అయితే నామినేషన్స్ లో కిక్ ఉంటుంది అని చాలామంది కంటెస్టెంట్స్ ప్రిపేరేడ్ గా రచ్చ చేస్తేనే ఫుటేజ్ వస్తుంది అని హౌస్ లోకి అడిగెట్టారు. గత రాత్రి నామినేషన్స్ లో అరుపులు కేకలతో బిగ్ బాస్ హౌస్ దద్దరిల్లిపోయింది. ఇక ఈరోజు నాలుగో పవర్ అస్త్ర కోసం బిగ్ ఫైట్ పెట్టారు బిగ్ బాస్. 

అందులో శోభా శెట్టి-శివాజీ-సందీప్ మాస్టర్ లు జేడ్జ్ లుగా వ్యవహరిస్తారు అని.. మిగత కంటెస్టెంట్స్ మద్యన పవర్ అస్త్ర కోసం బిగ్ బాస్ బ్యాంకు టాస్క్ పెట్టారు. ఈ క్రమంలో, మిగతా కంటెస్టెంట్స్ కాయిన్స్ ను సేకరించాలి.. ఎవరి దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటే వాళ్లే విన్నర్స్ అని బిగ్ బాస్ చెప్పగా అందరూ ఈ ఫైట్ కోసం రెడీ అయ్యారు. బిగ్ బాస్ బజర్ మోగిన వెంటనే పరుగెత్తుకెళ్లి ఏటీఎం కి ఉన్న బటన్ ని ప్రెస్ చేయాలని చెప్పడంతో.. అందరూ ఆ బటన్ నొక్కే ప్రయత్నం చేస్తున్న క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. 

ఈ తొక్కుడులో పల్లవి ప్రశాంత్ తలకు దెబ్బ తగిలి పక్కకు వచ్చేశాడు. అక్కడ అమరదీప్ నేను బటన్ నొక్కాను అంటే.. ప్రిన్స్ నేను నొక్కాను అనగానే.. సుబ్బు నేను నొక్కాను బటన్ అంటూ గొడవపడుతున్న క్రమంలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కుప్పకూలిపోయాడు. అయితే పల్లవి ప్రశాంత్ కు ఏ మేర గాయాలు అయ్యాయి.. ఎలా దెబ్బ తగిలింది అనేది ప్రోమోలో చూపించకుండా ఎపిసోడ్ కోసం ఉంచేశారు. 

Bigg Boss 7 today promo viral:

Bigg Boss 7 today promo highlights

Tags:   BIGG BOSS 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ