లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, త్రిషలు నటించిన లియో మూవీ అక్టోబర్ 19 న విడుదల కాబోతుంది. లోకేష్ కనగరాజ్ విక్రమ్ తో ప్యాన్ ఇండియా హిట్ కొట్టడంతో ఇప్పుడు విజయ్ లియో పై ట్రేడ్ లో భీభత్సమైన అంచనాలున్నాయి. అయితే ఈ రోజు చెన్నై వేదికగా లియో ఆడియో ప్లాన్ చేసారు.
విజయ్ ఫాన్స్ ఆగుతారా లియో టికెట్స్ తీసుకుని ఆడియో లాంచ్ కోసం రెడీ అయ్యారు. అసలే ప్రమోషన్స్ లో విజయ్ పెద్దగా కనిపించడు. ఇలా ఆడియో వేదికపై కనిపిస్తే ఆయన మాట్లాడితే చాలు అని అభిమానులు అనుకుంటారు. అందుకే ఆడియో వేడుక కోసం అభినులు ఆరాటపడ్డారు. మరికొద్ది గంటల్లో మొదలు కావాల్సిన లియో ఆడియో వేడుకని సడెన్ గా క్యాన్సిల్ చేసింది నిర్మాణ సంస్థ.
అయితే లియో ఆడియో వేడుక క్యాన్సిల్ అవడం వెనుక రాజకీయ కక్ష ఉంది అంటూ వార్తలొస్తున్నాయి. స్టాలిన్ ప్రభుత్వం విజయ్ పై కోపంతోనే లియో ఆడియో వేదిక విషయంలో ఆంక్షలు పెట్టింది. అందుకే లియో ఆడియోని కొద్ధి గంటల ముందు క్యాన్సిల్ చేసారంటూ విజయ్ ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ లియో నిర్మాణ సంస్థ మాత్రం అలాంటిదేం లేదు.. ఆడియో పాస్ ల కోసం అభ్యర్ధనలు ఎక్కువ వచ్చాయి.
అంతేకాదు భద్రతా కారణాల వలన మేము లియో ఆడియో వేడుకని నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నాము. కానీ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ మేము మీకు అందుబాటులో ఉంటామంటూ.. చాలామంది అనుకున్నట్టుగా మాపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫాన్స్ ని కూల్ చెసే ప్రయత్నం చేసింది.