మహేష్ బాబు గుంటూరు కారం ప్రాజెక్ట్ కోసం కాస్త రఫ్ లుక్ లోకి మారారు. చిన్నపాటి గెడ్డంతో మహేష్ రఫ్ హెయిర్ స్టయిల్ తో కనిపిస్తున్నారు. అయితే ఈమద్యలో మహేష్ రెండుమూడు సార్లు లుక్ చేంజ్ చేసారు. కారణం ఆయన చేసిన కొన్ని యాడ్ షూట్స్ కోసం, వాటికి సంబందించిన షూట్ కోసమే. తాజాగా మహేష్ బాబు కొత్త హెయిర్ స్టయిల్ లుక్ ఒకటి వైరల్ అయ్యింది.
ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చెయ్యడానికి మహేష్ ఇలా కొత్త లుక్ లోకి మారారట. అది కూడా క్లాత్ అండ్ జ్యువెలరీ యాడ్ కోసమని తెలుస్తోంది. మాంగల్య క్లాత్ అండ్ జ్వేలరీ స్టోర్స్ కి మహెష్ బ్రాండ్ అంబాసిడర్ గా దానిని ప్రమోట్ చేస్తున్నారు. నిన్న జరిగిన ఆ యాడ్ షూట్ కోసమే మహేష్ ఈ కొత్త లుక్ అంటున్నారు.
ఇక మహేష్ బాబు గుంటూరు కారం సంక్రాంతికి రెడీ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. త్వరలోనే గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ అనౌన్సమెంట్ రాబోతుంది.