ప్రభాస్ సలార్ మూవీ పోస్ట్ పోన్ అంటూ సోషల్ మీడియాలో పీలర్స్ వదిలిన సలార్ మేకర్స్ హోంబలే ఫిలిమ్స్ వారు ఆ విషయాన్ని కన్ ఫర్మ్ చెయ్యడానికి చాలా సమయమే తీసుకున్నారు. ఈలోపులో పలు ప్యాన్ ఇండియాలోని పలు భాషల వారు తమ సినిమాలని హడావిడిగా సలార్ డేట్ కి లాక్ చేసుకున్నాయి. సలార్ మేకర్స్ ఏమి పట్టనట్టుగా అనుకున్న విషయాన్ని చెప్పడానికి కూడా అంత ఎందుకు ఆలోచిస్తున్నారో ఫాన్స్ కి అర్ధం కావడం లేదు.
ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలోనూ అంతే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. డిసెంబర్ 22 అంటూ పీలర్లు వదులుతున్నారు. కానీ ఆ విషయాన్ని అధికారికంగా చెప్పకపోయేసరికి.. కొంతమంది హీరోలు అంటే ఆ డిసెంబర్ 21, 22 డేట్స్ లాక్ చేసుకున్న హీరోలు తమ సినిమాల రిలీజ్ డేట్స్ ని మార్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. అందులో నాని, నితిన్, వెంకటేష్ ఉన్నారు.
డిసెంబర్ 21 నాని హాయ్ నాన్న, 22 వెంకటేష్ సైంధవ్, నితిన్ ఎక్స్ట్రా మూవీస్ రావాలి. కానీ ఇప్పుడు ప్రభాస్ సలార్ వస్తే తమ సినిమాలకి ఓపెనింగ్స్ ఉండవు. అందుకే ప్రీ పోన్ అయినా లేదంటే పోస్ట్ పోన్ అయినా చేసుకోవడానికి చర్చలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. సలార్ మేకర్స్ అధికారికంగా డేట్ చెప్పేస్తే ఎవరికి వారే సర్దుకుంటారు. రిలీజ్ డేట్ చెప్పకుండా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే ఎలా అనేది ఇండస్ట్రీ ప్రశ్న.
తెలుగులోనే ఇలా ఉంటే తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఇంస్ట్రీలు ఏమనుకోవాలి. తమ సినిమాలు సలార్ తో పోటీ పడడం ఇష్టం లేకపోతె డేట్స్ మార్చుకుంటారు. అందుకే అందరూ సలార్ నిర్మాతలు హోంబలే ఫిలిమ్స్ వారు చేసే పనిని విమర్శిస్తున్నారు. క్లారిటీ ఇవ్వండి.. ఇంత సస్పెన్స్ అవసరం లేదు అంటున్నారు.