తెలుగు సినిమాలకి దూరమైన రకుల్ ప్రీత్ సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకి చేరువలోనే ఉంటుంది. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవుదామని కలలు కన్నా రకుల్ ప్రీత్ కి అది కలగానే మిగిలిపోయేలా కనబడుతుంది. అక్కడ ఖాళీగా లేకుండా సినిమాలు చేస్తూ బిజీగానే ఉన్నప్పటికి.. సక్సెస్ మాత్రం ఆమె దరి చేరడమే లేదు. జాకీ భగ్నానీతో ప్రేమతో బాగా హైలెట్ అయిన రకుల్ పెళ్లి విషయం అడిగితే తెగ ఫైరవుతుంది.
ఇక బాలీవుడ్ లో ఏ ఈవెంట్ అయినా గ్లామర్ అవుట్ ఫిట్స్ తో వాలిపోవడమే కాదు.. అంతకుముందే ఫోటో షూట్స్ చేయించుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఇక రకుల్ ప్రస్తుతం ఇండియన్ 2 మూవీ షూటింగ్ లో పాల్గొంటుంది. కమల్ హాసన్-శంకర్ కలయికలో రాబోతున్న ఈ మూవీపై రకుల్ చాలా ఎగ్జైట్ అవుతుంది..
ప్రస్తుతం రకుల్ ఈ రోజు మంగళవారం పింక్ శారీ పిక్స్ ని పోస్ట్ చేస్తూ లైట్ కెమెరా యాక్షన్ అంటూ క్యాప్షన్ పెట్టింది. స్పెషల్ గా చేయించుకున్న ఫోటో షూట్ ని పోస్ట్ చేసింది. ఆ పింక్ సారీ లో రకుల్ అందాలు చూసి యూత్ మైమరిచిపోతున్నారు. పింక్ సారీ లో సీతాకోక చిలుకలా రకుల్ మెరిసిపోతూ బ్యూటిఫుల్ గా కనిపించింది.