మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెస్ట్ మోడ్ ఉన్నారంటున్నారు. ఆయన మోకాలి ఆపరేషన్ తో ప్రస్తుతం షూటింగ్స్ కి దూరంగా చిరు ఇంట్లోనే ఉంటున్నారు. అయితే చిరంజీవి పుట్టిన రోజున రెండు సినిమాలని అనౌన్స్ చేసారు. అందులో ఒకటి కూతురు సుస్మిత నిర్మాణంలో, మరొకటి బింబిసార దర్శకుడు వసిష్ఠ దర్శకత్వంలో. అయితే ముందుగా సుస్మిత నిర్మాణంలో కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా మెగా 156 ఉండబోతుంది అన్నారు. కానీ భోళా శంకర్ రిజల్ట్ తర్వాత కళ్యాణ్ కృష్ణ మూవీపై చిరు పునరాలోచనలో పడ్డారు.
ఇప్పుడు కూడా మెగాస్టార్ ముందుగా వసిష్ఠతో మూవీ మొదలు పెట్టాలని చూస్తున్నారట. వసిష్ఠ కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారట. నవంబర్ నుంచి మెగాస్టార్ చిరు-వసిష్ఠ ల కాంబో మూవీ పట్టాలమీదకి వెళుతుందట. అటు చిరు మెగా 156 ని కళ్యాణ్ కృష్ణ తో చేయించాలా, లేదా అనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. రీసెంట్ గా జరిగిన మీటింగ్ లో 156 ప్రాజెక్ట్ ని ఆపి ముందుగా వసిష్ఠ తో మూవీ మొదలు పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసి మెగా ఫాన్స్ ఆనందిస్తున్నారు.
ఎందుకంటే కళ్యాణ్ కృష్ణ చిరు తో రీమేక్ చేస్తున్నాడనే ప్రచారం, ఒక రీమేక్ తో దెబ్బతిన్న చిరు కళ్యాణ్ కృష్ణ తో చెయ్యబోయే రీమేక్ గురించి పునరాలోచనలో ఉన్నట్లుగా వార్తలు రావడం ఇవన్నీ మెగా అభిమానులని కాస్త నిరాశపరిచాయి. ఇప్పుడు చిరు నిర్ణయంతో మెగా ఫాన్స్ హ్యాపీగా ఉన్నారట.