చంద్రముఖి సినిమాతో వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. జ్యోతిక, నయనతార, ప్రభు వీళ్లంతా సినిమా హిట్ లో భాగమయ్యారు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా రాఘవ లారెన్స్ వాసు దర్శకత్వంలోనే చంద్రముఖి 2 చేసారు. ఆ చిత్రం రేపు గురువారం సెప్టెంబర్ 28 న విడుదల కాబోతుంది. ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టినప్పుడే లారెన్స్ సూపర్ స్టార్ రజిని దగ్గరకి వెళ్లి ఆయన బ్లెస్సింగ్ తీసుకున్నారు.
ఇక సినిమా అంతా సక్రమంగా విడుదలకు రెడీ అవడంతో లారెన్స్ మరోమారు సూపర్ స్టార్ దగ్గరికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వైరల్ గా మారాయి. రాఘవని ఆశీర్వదించి ప్రేమతో హగ్ చేసుకున్నారు రజిని. రజినీ ఆశీస్సులు కూడా తీసుకున్నాను అంటూ రాఘవ రెండు బ్యూటిఫుల్ ఫోటోలు షేర్ చేసి తాను తన ఆనందాన్ని పంచుకున్నారు. దీనితో వారి అభిమానులు ఈ ఫోటోలు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ క్వీన్ కంగనా చంద్రముఖి రోల్ లో కనిపించబోతుంది. చంద్రముఖి 2 ని రాఘవ బాగా ప్రమోట్ చేసారు. కంగనా కూడా చెన్నై లోనే కాదు.. తెలుగు ఇలా ఆ చిత్రం ఎన్ని భాషల్లో రిలీజ్ అవుతుందో అన్ని భాషల్లోను ప్రమోషన్స్ లో పాల్గొంది. తెలుగులో ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ తెలుగు మర్కెట్ ని రాఘవ లారెన్స్ బాగా టార్గెట్ చేసారు.