గువారం విడుదలకాబోయే స్కంద సందడి బాగానే కనిపిస్తుంది. కాకపోతే ఇంకాస్త ముందు కనిపించినట్టయితే మొదటి రోజు ఓపెనింగ్స్ అదిరిపోయేవే. రామ్ చాలా లేట్ గా ప్రమోషన్ మొదలు పెట్టాడు. బోయపాటి ఎలాంటి ఇంటర్వూస్ లో కనిపించడం లేదు. రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్కంద హిట్ అవుతుంది అనే నమ్మకంతో ఆయన కనిపించారు. రామ్ స్టయిల్, శ్రీలీల క్రేజ్, బోయపాటి మేకింగ్ అన్ని సినిమాపై అంచనాలుపెంచేవిగా ఉన్నాయి.
గత స్కంద ట్రైలర్ పై విమర్శలొచ్చినా నిన్న రాత్రి విడుదలైన స్కంద ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అన్నీ బాగానే ఉన్నాయి. ఏదో ఒక ఇంటర్వ్యూలో ప్యాన్ ఇండియాలో మూవీని విడుదల చేస్తే అది పలు రకాల భాషల ప్రేక్షకులకి ఎక్కుతుందా.. స్కంద ప్యాన్ ఇండియా రిలీజ్ అనడమే కానీ అందుకు అనుగుణంగా టీం ఎలాంటి చొరవ చూపించలేదు. రామ్ బాలీవుడ్ ఇంటర్వూస్ తో సరిపెట్టేసేసాడు. ఇక రాత్రి ఈవెంట్ లో హీరోయిన్ శ్రీలీల మిస్సింగ్.
మరి స్కంద ప్యాన్ ఇండియా మార్కెట్ లో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.. ఒకవేళ సినిమాకి మొదటిరోజు పాజిటివ్ టాక్ వస్తే గనక అది ఖచ్చితంగా ప్యాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేస్తుంది. టాక్ తేడా కొడితే అప్పుడు కష్టమవుతుంది.