ప్రభాస్ సలార్ వచ్చేది సెప్టెంబర్ 28 అని ప్రభాస్ ఫాన్స్ సంబరపడ్డారు. కానీ మేకర్స్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు. అయితే కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది చెప్పకుండా నాన్చడంతో సోషల్ మీడియాలో సలార్ రిలీజ్ డేట్ ఇదే అంటూ రకరకాల తేదీలు తెరపైకి వస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. ఏదో కాలికి సర్జరీ అన్నారు.
అయితే సలార్ ని డిసెంబర్ 22 న విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యి ఆ తేదీని ప్రకటించేందుకు సిద్ధమయ్యారని న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే తెలుగులో ఆ డిసెంబర్ మూడో వారంలో నాని, వెంకటేష్ తమ సినిమాల డేట్స్ ని ఆరు నెలల క్రితమే ప్రకటించారు. అలాగే హిందీ లోను ఆ వారం పెద్ద సినిమా రిలీజ్ అవ్వబోతుంది.
మరి డైనోసార్ డిసెంబర్ 22 న వస్తే బాక్సాఫీసు లెక్కలన్నీ మారిపోతాయి.. అంటూ సోషల్ మీడియాలో అభిమానులు పండగ చేస్తున్నారు. డిసెంబర్ 22 న అంటే క్రిస్టమస్ సెలవలు కలిసొస్తాయి. అదే డేట్ ఫిక్స్ చేస్తారని నమ్మకంగా ఉన్నారు.