Advertisement
TDP Ads

పుష్ప2 ఓటిటీ హక్కుల కోసం తీవ్ర పోటీ

Mon 25th Sep 2023 08:31 PM
allu arjun  పుష్ప2 ఓటిటీ హక్కుల కోసం తీవ్ర పోటీ
Pushpa 2 Post Theatrical Streaming Rights Acquired By Netflix పుష్ప2 ఓటిటీ హక్కుల కోసం తీవ్ర పోటీ
Advertisement

అల్లు అర్జున్-సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న పుష్ప ద రూల్ పై భారీ అంచనాలున్నాయి. పుష్ప పార్ట్ 1 సూపర్ హిట్ అవడమే కాదు.. రీసెంట్ గా అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రకి గాను నేషనల్ అవార్డు గెలుచుకోవడం కూడా పుష్ప ద రూల్ పై అంచనాలు పెరగడానికి కారణమయ్యాయి. రీసెంట్ హైదరాబాద్ లో పుష్ప 2 కి సంబంధించిన చిన్నపాటి షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్ లో చిన్న యాక్షన్ సన్నివేశాన్ని సుకుమార్ చిత్రీకరిస్తున్నారు. 

ప్రస్తుతం పుష్ప 2 పై ఉన్న క్రేజ్ తో ఈ చిత్ర డిజిటల్ హక్కుల కోసం తీవ్ర పోటీ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ పుష్ప ద రూల్ ఓటిటీ హక్కుల కోసం ట్రై చేస్తుందట. రికార్డ్ ప్రైస్ ని పుష్ప 2 కోసం కోట్ చేసినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఓటిటీ దిగ్గజాల్లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న నెట్ ఫ్లిక్స్ కే పుష్ప 2 రైట్స్ సొంతమవుతాయని అంటున్నారు. 

ఇక ఆగష్టు 15 2024 న విడుదల డేట్ లాక్ చేసిన పుష్ప మేకర్స్ చాలా తెలివైనవారంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఆ తేదీ కి వచ్చే పుష్ప 2 కి వరసగా నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ కలిసిరానుంది అని, వారాంతంలో బాక్సాఫీసు ని పుష్ప 2 చెడుగుడు ఆడేస్తుంది అంటున్నారు. 

Pushpa 2 Post Theatrical Streaming Rights Acquired By Netflix:

Allu Arjun Pushpa 2 Post Theatrical Streaming Rights Acquired By Netflix

Tags:   ALLU ARJUN
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement