Advertisementt

గేమ్ చేంజర్ షూట్ లో రామ్ చరణ్ కి గాయం

Mon 25th Sep 2023 05:19 PM
ram charan  గేమ్ చేంజర్ షూట్ లో రామ్ చరణ్ కి గాయం
Ram Charan injured in Game Changer sets గేమ్ చేంజర్ షూట్ లో రామ్ చరణ్ కి గాయం
Advertisement
Ads by CJ

గేమ్ చేంజర్ - ఇండియన్ 2 షూటింగ్స్ ని రామ్ చరణ్, కమల్ హాసన్ తో డేట్స్ క్లాష్ కాకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రెండు సినిమాలని బ్యాలెన్స్ చేస్తున్నారు దర్శకుడు శంకర్. ఓ పది రోజులు చరణ్ తో, ఓ పది రోజులు కమల్ తో అన్నట్టుగా సాగుతుంది. అలానే రీసెంట్ గా రామ్ చరణ్-కియారా అద్వానీపై ఓ సాంగ్ చిత్రికరణని రామోజీ ఫిలిం సిటీలో మొదలు పెట్టారన్నారు. మొదలు పెట్టిన రొండోరోజే షూటింగ్ ప్యాకప్ చెప్పయ్యడంపై చాలారకాల అనుమానాలు రేజ్ అయ్యాయి. 

అయితే గేమ్ చేంజర్ కి సంబందించిన కొంతమంది నటులు అందుబాటులో లేకపోవడంతో ఈ నెలలో జరగాల్సిన షెడ్యూల్ రద్దు చెయ్యబడింది.. అక్టోబర్ రెండో వారంలో తిరిగి ఆ షెడ్యూల్ ని మొదలు పెడతామంటూ అప్ డేట్ ఇచ్చారు. అయితే చిత్ర బృందం చెప్పిన కారణంగా ఆ షెడ్యూల్ రద్దు కాలేదు అని.. రామ్ చరణ్ కి సెట్స్ లో గాయమవడంతో ఈ షెడ్యూల్ ని 20 రోజులపాటు రద్దు చేసారంటున్నారు. 

రామ్ చరణ్ కి తగిలింది చిన్న దెబ్బె కానీ.. దాని వలన చరణ్ ని డాక్టర్స్ ఓ పది రోజులపాటు రెస్ట్ తీసుకోమన్నారని అందుకే శంకర్ గేమ్ చేంజర్ ని ప్రస్తుతం వాయిదా వేశారని.. రామ్ చరణ్ పూర్తిగా కోలుకున్నాకే కొత్త షెడ్యూల్ మొదలవుతుంది అంటూ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. 

Ram Charan injured in Game Changer sets:

Ram Charan injured: Game Changer schedule delayed

Tags:   RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ