Advertisement

పవన్ ఎక్కడ? వైసీపీ కొత్త ప్రచారం!

Thu 28th Sep 2023 04:43 PM
ysrcp,pawan kalyan,target,tdp,silent  పవన్ ఎక్కడ? వైసీపీ కొత్త ప్రచారం!
Where is Pawan Kalyan? YSRCP New Strategy పవన్ ఎక్కడ? వైసీపీ కొత్త ప్రచారం!
Advertisement

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏ విషయంలోనూ సీరియస్‌నెస్ ఉండదని ఎప్పటి నుంచో అధికార పార్టీ విమర్శిస్తూ వస్తోంది. ఏదో షూటింగ్ మధ్యలో వచ్చేసి కాస్త హడావుడి చేసి గాయబ్ అవుతారని అంటుంటారు. కొన్ని సార్లు పవన్ నడుచుకునే విధానం కూడా ఈ విమర్శలకు తావిస్తోంది. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు అరెస్ట్, రిమాండ్, కస్టడీ వంటి అంశాలు కాక రేపుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్ చాలా హడావుడి చేశారు. ఆ తరువాత రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి మరీ చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు.

చంద్రబాబును కలిసి బయటకు వచ్చిన అనంతరం పొత్తు ప్రకటన చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన జగన్మోహన్ రెడ్డిపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు చెప్పారు. జగన్ ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అంతా బాగానే ఉంది. అటు టీడీపీ కేడర్ అంతా కూడా చాలా సంతోషంలో మునిగిపోయింది. ఈ తరుణంలో పవన్... టీడీపీకి అండగా నిలవడం కార్యకర్తల్లో ఎక్కడ లేని జోష్‌ను నింపింది. కట్ చేస్తే పవన్ ఎక్కడ? ఏమై పోయారు. ఆ రోజు పొత్తు ప్రకటన చేశాక ఆయన మాయమయ్యారు. ఎక్కడా కనిపించిందే లేదు.

ఇప్పుడు చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించడం, కస్టడి వంటి అంశాలకు మించిన ఇష్యు పవన్‌కు ఏముంటుందో తెలియక టీడీపీ కార్యకర్తలు డైలమాలో పడ్డారు. పైగా అసెంబ్లీలో టీడీపీ నేతల సస్పెన్షన్ వంటి అంశాలు ఉండనే ఉన్నాయి. ఈ సమయంలో వారాహి యాత్రను మొదలు పెట్టి జగన్ ప్రభుత్వాన్ని ఏకిపారేయాలి కదా. పవన్ యాత్ర మొదలు పెడితే జనసేన కార్యకర్తలతో పాటు టీడీపీ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఇప్పుడు అధికార పార్టీ కొత్త ప్రచారం మొదలు పెట్టింది. ఏసీబీ కోర్టు తర్వాత పవన్ ఆలోచనలో మార్పు వచ్చిందని.. పొత్తుపై పునరాలోచనలో పడ్డారని.. అందుకే పవన్ కనిపించకుండా పోయారంటూ కొత్త ప్రచారానికి తెరదీసింది. ఈ ప్రచారానికి పవనే చెక్ పెట్టాల్సి ఉంది.

Where is Pawan Kalyan? YSRCP New Strategy:

YSRCP Targets Pawan Kalyan with his Silent 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement