పూజా హెగ్డే సౌత్ హీరో లేవరితో డేటింగ్‌లో ఉంది అని కానీ.. హీరోగారితో ప్రేమాయణం నడుపుతుంది అని కానీ కనీసం రూమర్స్ కూడా లేవు.. ఇక్కడా టాప్ చైర్‌కి దగ్గరై, టాప్ పొజిషన్‌ని ఎంజాయ్ చేస్తూ స్టార్ హీరోలతో జత కట్టినా.. ఏనాడూ పూజా హెగ్డేపై ఎలాంటి లవ్ రూమర్ రాలేదు. కానీ బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో ఒక్క సినిమా చేసిందో లేదో.. సల్మాన్‌తో పూజా హెగ్డే డేటింగ్ చేస్తుంది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. వాటికి పూజా హెగ్డే, సల్మాన్ కూడా వివరణ ఇచ్చుకున్నారు.
ప్రస్తుతం కెరీర్ డౌన్ ఫాల్‌లో ఉన్న బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇప్పుడు ప్రేమలో ఉండడమే కాదు పెళ్లి పీటలెక్కబోతుంది అనే న్యూస్ వైరల్‌గా మారింది. పూజా హెగ్డే ఓ స్టార్ క్రికెటర్‌తో ఏడడుగులు వేయనుందని అంటున్నారు. కానీ పూజా హెగ్డే ఓ క్రికెటర్ తో స్నేహం చేసినట్టుగానీ, డేటింగ్‌లో ఉన్నట్టుగా కానీ ఇంతవరకు ఎక్కడా ఒక్క రూమర్ కూడా వినిపించలేదు.
కానీ ఉన్నట్టుండి పూజా హెగ్డే స్టార్ క్రికెటర్‌తో ఏడడుగులు వేసేందుకు రెడీ అయ్యింది అనే న్యూస్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించడం బుట్టబొమ్మ అభిమానులకే సర్ ప్రైజింగ్‌గా ఉంది. మరి ఆ క్రికెటర్ ఎవరు? అతనితో ఎప్పటి నుంచి డేటింగ్‌లో ఉంది? అనే విషయాలు ఇక ఒక్కొక్కటిగా బయటికి రావాల్సి ఉన్నాయి. చూద్దాం.. ఈ వార్తలపై పూజా ఎలా రియాక్ట్ అవుతుందో..