Advertisementt

బిగ్ బాస్ 7: ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే..

Sun 24th Sep 2023 10:13 PM
bigg boss telugu 7  బిగ్ బాస్ 7: ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే..
Bigg Boss 7: Who will be eliminated this week? బిగ్ బాస్ 7: ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 మూడో వారం ముగిసింది. నాగార్జున హోస్ట్ గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 7 మూడు వారాలకు గాను 14 మందిలో ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడారు. ఈ వారం మూడో పవర్ అస్త్ర కోసం శోభా శెట్టి, ప్రియాంక, ప్రిన్స్ యావర్ లు పోటీ పడగా.. అమ్మాయిల గేమ్ లో ప్రిన్స్ యావర్ బలైపోయాడు. శోభా శెట్టి మూడో పవర్ అస్త్ర గెలిచి కెప్టెన్ అయినా.. ప్రిన్స్ మాత్రం యావత్ ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నాడు. 

అయితే  ఈవారం ఎలిమినేషన్స్ లో ఉన్న వారిలో ముందుగా ఈ వారం యావర్ సేవ్ అయ్యాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్, రతిక, ప్రియాంక, గౌతమ్, అమరదీప్ లు సేవ్ అవ్వగా.. ఈ వారం ఫైనల్ ట్విస్ట్ లో సుబ్బు-దామిని ఇద్దరూ ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్న క్యూరియాసిటీ కలిగించారు. శుభశ్రీ-దామిని మధ్యలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అని నాగార్జున టాస్క్ పెట్టగా.. ఫైనల్ గా దామిని హౌస్ ని వీడింది. 

డీసెంట్ గా హౌస్ లో కనిపించే దామిని ప్రిన్స్ యావర్ విషయంలో చేసిన గొడవ ఆమె గ్రాఫ్ పడిపోయేలా కాదు.. ఈరోజు మూడో కంటెస్టెంట్ గా హౌస్ ని వీడాల్సి వచ్చేలా చేసింది. ఇక మూడు వారాలుగా కిరణ్ రావు, షకీలా, ఈరోజు ఆదివారం దామిని ఎలిమినేషన్ తో ముగ్గురు అమ్మాయిలు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. 

Bigg Boss 7: Who will be eliminated this week?:

Bigg Boss Telugu 7: Nagarjuna Evicts Another Female Contestant

Tags:   BIGG BOSS TELUGU 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ