సూర్య-జ్యోతిక గత కొద్దిరోజులుగా ముంబైలోనే తమ పిల్లలతో కలిసి ఉంటున్నారు. సూర్య ఫ్యామిలీతో తరచూ ముంబై లో కనిపించడంపై కోలీవుడ్ మీడియాలో సూర్యకి ఆయన తండ్రి శివ కుమార్ కి మద్యన పొసగడం లేదు.. జ్యోతిక వలనే సూర్య తండ్రితో విడిపోయి చెన్నై నుంచి వెళ్ళిపోయి ముంబైలో మకాం పెట్టారంటూ సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ లు కనిపిస్తున్నాయి. జ్యోతిక పెళ్ళికి ముందు యాక్టింగ్ చెయ్యను అని సూర్య తండ్రి శివ కుమార్ కి మాటిచ్చింది. కానీ ఇప్పుడు ఆమె పూర్తిగా నటన వైపుకి వెళ్లిపోవడంతో ఆయనకి నచ్ఛలేదు.
భార్యని వ్యతిరేఖిస్తున్న తండ్రితో సూర్య విభేదించాడంటూ న్యూస్ లు స్ప్రెడ్ అయ్యాయి. కార్తీ కూడా అన్నకి సపోర్ట్ చెయ్యకుండా తండ్రికి సపోర్ట్ చేస్తున్నాడన్నారు. అయితే తాజాగా కార్తీ సూర్య-జ్యోతిక ముంబై షిఫ్ట్ అవడంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నేను జ్యోతికని ఒక నటిగా చూడలేదు. ఒక అమ్మగానే చూసాను. తాను కూడా మమ్మల్ని పిల్లల మాదిరే చూసింది. అమ్మ ఇప్పుడు ముంబైలో ఉండడంతో ఇల్లంతా బోసిపోయింది. అన్నయ్య పిల్లలు పెరుగుతున్నారు. వారి చదువుల కోసమే అన్నయ్య-అమ్మ వాళ్లు ముంబై కి షిఫ్ట్ అయ్యారు.
అమ్మ లేని ఇంట్లో మేము సంతోషంగా లేము, అమ్మతో కలిసి ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఇన్నేళ్ళుగా మేము హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం జ్యోతిక అమ్మే. పిల్లల చదువులు పూర్తయ్యాక అందరం కలిసే ఉంటాము. ప్రస్తుతం ప్రతి పండగని కలిసే జరుపుకుంటున్నామంటూ కార్తీ సూర్య-జ్యోతికలపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.