గోవా బ్యూటీ ఇలియానా ప్రెగ్నెన్సీ, బిడ్డ పుట్టడం అన్ని ఈ ఏడాది సర్ ప్రైజింగ్ గా జరిగిపోయాయి. ఆస్ట్రేలియా ఫొటో గ్రాఫర్ ఆండ్రు కి బ్రేకప్ చెప్పాక కొద్దిరోజులు డిప్రెషన్ లోకి వెళ్ళిన ఇలియానా తర్వాత 2023 మే లో మైఖేల్ డోలన్ అనే వ్యక్తితో జీవితాన్ని ప్రారంభించింది. ఆ విషయం చెప్పకుండా ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. దానితో అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. డెలివరీ దగ్గర పడ్డాక తను మైఖేల్ డోలన్ తో బంధం కలుపుకున్నట్టుగా రివీల్ చేసింది.
ఆగష్టు 1న ఇలియానాకి ఒక కొడుకు పుట్టాడు. అతనికి కోవా ఫీనిక్స్ డోలన్ అనే పేరును పెట్టినట్లుగా రివీల్ చేసేసింది.. తాజాగా ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన కొడుకు కోవా ఫీనిక్స్ డోలన్ కి సాక్సులు వేసిన ఫొటోస్ ని పంచుకున్నది. ఈ ఆనందం మాటల్లో వర్ణించలేనిది అంటూ ఇలియానా ఇన్స్టా స్టోరీస్ రాసుకొచ్చింది. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్‌లో ఎత్తుకున్న ఫొటోతో కన్నీళ్ల ఎమోజిని కూడా షేర్ చేసింది ఇలియానా.
తనకి నెలలు నిండాక తాను ఎంత ఆనందంగా ఉన్నానో.. తల్లి అవడం ఓ గొప్ప వరం. ఈ అనుభూతిని పొందుతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. కాబట్టి ఈ అవకాశం నన్నొక అదృష్టవంతురాలిని చేసింది. దీనిని మాటల్లో వర్ణించడం చాలా కష్టం.. అంటూ రాసుకొచ్చిది.