లైగర్ డిసాస్టర్ తర్వాత ఖుషి మూవీతో డీసెంట్ గా హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆ చిత్రంలో కనిపించిన తీరుకి, ఆ లుక్స్ కి రౌడీ ఫాన్స్ ఫిదా అవవడమే కాదు అమ్మాయిలైతే విజయ్ దేవరకొండని చూసి అబ్బా ఏమున్నాడ్రా అనేలా విజయ్ కనిపించాడు. యాక్టింగ్ అలాగే లుక్స్ వైజ్ గా స్టార్ హీరోయిన్ సమంతనే డామినేట్ చేసేసాడు.
ప్రస్తుతం ఖుషీలో విజయ్ దేవరకొండ లుక్స్ పై టాలీవుడ్ లో పెద్ద చర్చే నడుస్తుంది. హోమ్లీ లుక్స్ తో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ఈమధ్యనే ఫ్యామిలీతో కలిసి ట్రెడిషనల్ గా వినాయక చవితి పూజ చేసుకుని ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. తాజాగా Sunday mornings 🥰 అంటూ క్యాప్షన్ పెట్టి ఐస్ టబ్ లో కూర్చున్న పిక్ ని షేర్ చేసాడు.
ఐస్ టబ్ లో సండే ఉదయం విజయ్ అలా కనిపించగానే.. తన హ్యాండ్ సమ్ సీక్రెట్ ఇదేనేమో అనేలా ఉందా పిక్. ఆ పిక్ చూసాక All good vibes with @TheDeverakonda on Sunday mornings☀️ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.