టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 15 రోజుల క్రితం అరెస్ట్ అవ్వగానే విజయవాడలో హడావిడి చేసి ఆ తరవాత చంద్రబాబుతో రాజమండ్రి జైల్లో ములాఖత్ అయ్యి బాలకృష్ణ-లోకేష్ సాక్షిగా మీడియా ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్.. టీడీపీ - జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నాయి, ఈ ఎన్నికల్లో బీజేపీ కూడా మాతో కలుస్తుంది అని ఆశిస్తున్నాము, సైకో జగన్ ని ఇంటికి పంపించడమే మా తక్షణ కర్తవ్యం.. జగన్ ఇక నీకు జైలే.. ఆరు నెలలే సమయం ఉంది అంటూ పవర్ ఫుల్ గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మరో పబ్లిక్ మీటింగ్ లో కనిపించారు.
మళ్ళీ చంద్రబాబు అరెస్ట్ విషయంపై చప్పుడు చెయ్యకుండా కామ్ గా ప్రస్తుతం తన సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. సుజిత్ దర్శకత్వంలో OG, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ రాజకీయాల్లో యాక్టీవ్ కావాలని జనసైనికులు కోరుకుంటున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న టైమ్ లోనే పవన్ పబ్లిక్ లో కనిపిస్తే పొలిటికల్ మైలేజ్ పెరుగుతుంది అంటున్నారు.
నిత్యం జనాల్లో తిరుగుతూ హడావిడి చేస్తుంటే ప్రజలకి కూడా మా నేత పైన నమ్మకం పెరుగుతుది.. ఈ ఎలక్షన్స్ లో చక్రం తిప్పొచ్చు అనే భావనలో జన సైనికులు ఉన్నారు. లోకేష్ ఢిల్లీలో ఉన్నాడు. ఈ సమయంలో పవన్ ఏపీ రాజకీయాలు, బాబు అరెస్ట్ పై తరచూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే బావుంటుంది అనేది వారి ఆలోచన.