విజయ్ దేవరకొండ-సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి మూవీ ఈనెల మొదటివారంలో విడుదలైంది. సెప్టెంబర్ 1న విడుదలైన ఖుషి మూవీకి పబ్లిక్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం అంతగా రాలేదు. పలువురు బయ్యర్లు ఖుషి మూవీతో కొద్దిపాటి నష్టాలు చవిచూశారు. విజయ్ దేవరకొండ మ్యాన్లీ లుక్స్, స్టోరీ, మేకింగ్ అన్నీ బావున్నా సమంత యాక్టింగ్, ఆమె లుక్స్, సీరియల్ టైప్ మేకింగ్ అంటూ ఖుషిని చూసి చాలామందే విమర్శించారు.
ఇక థియేటర్స్ లో సెప్టెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తుందా అని ఫ్యామిలీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఖుషి సినిమా డిజిటల్ పార్ట్నర్ నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయ్యింది. సెప్టెంబర్ 1 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం అక్టోబర్ 1 న ఓటిటిలోకి రాబోతుంది. కాస్త లేట్ గా ఓటిటి స్ట్రీమింగ్ కి వస్తుంది అనుకున్నా ఖుషి నాలుగు వారాలు తిరిగేసరికి నెట్ ఫ్లిక్స్ లోకి ప్రత్యక్షం కానుంది.
ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. విజయ్ దేవరకొండ-సమంత ల ఖుషి చిత్రం అక్టోబర్ 1 నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది అని. థియేటర్స్ లో సో సో గా ఆడిన ఈ చిత్రాన్ని ఓటిటి ఆడియన్స్ ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.