మహేష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ మూవీగా మొదలైన గుంటూరు కారం ఎన్నో అడ్డంకులు అదిగమించి ప్రస్తుతం షూటింగ్ చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్ లుక్, బర్త్ డే టీజర్ అన్ని సినిమాపై అంచనాలు పెంచేవిగా ఉండగా.. ఇప్పుడు గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు.
వినాయక చవితికి గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ అది కూడా హీరో గారో సోలో సాంగ్ అన్నారు కానీ.. అది జరగలేదు. ఆ విషయంలో అభిమానులు కూడా డిస్పాయింట్ అయ్యారు. ఇక ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం సాంగ్ తో అప్ డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. సాంగ్ మిక్సింగ్ అయ్యి లిరికల్ అవ్వగానే రిలీజ్ చేస్తారు, ఫైనల్ మిక్సింగ్ లో ఉంది. సింగర్ అనురాగ్ కులకర్ణి ఒక వర్షన్ పాడరాని సమాచారం.
గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ని అక్టోబర్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు.. అంటూ సోషల్ మీడియాలో కొంతమంది మీడియా పర్సన్స్ అప్ డేట్స్ ఇస్తున్నారు. దీనిని బట్టి అభిమానులకి దసరా వరకు గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ పండగ లేనట్లే.